ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో శోభితా ధూళిపాళ్ల( Sobhita Dhulipala ) ఒకరనే సంగతి తెలిసిందే.పొన్నియిన్ సెల్వన్ 2( Ponniyin Selvan 2 ) సక్సెస్ తర్వాత ఈ బ్యూటీ ది నైట్ మేనేజర్ 2 అనే ప్రాజెక్ట్ లో నటించగా ఒక ఇంటర్వ్యూలో తనకు కాబోయే వాడి లక్షణాల గురించి ఆమె వెల్లడించారు.
లైఫ్ లో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే క్వాలిటీ ఉండాలని శోభిత పేర్కొన్నారు.మంచి మనస్సు ఉండాలని, సింప్లిసిటీ ఉండాలని శోభిత చెప్పుకొచ్చారు.
ప్రకృతిని ప్రేమించడంతో పాటు ఇతరుల పట్ల దయ ఉన్న వ్యక్తి తన జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.ఈ లైఫ్ చాలా చిన్నదనే విషయాన్ని అతను గుర్తుంచుకోవాలని శోభిత అన్నారు.
లైఫ్ లోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని శోభిత ధూళిపాళ్ల చెప్పుకొచ్చారు.నాగచైతన్యతో( Naga Chaitanya ) రిలేషన్ షిప్ గురించి శోభిత మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆ వార్తలు ఎంత మాత్రం బాధించవని శోభిత అన్నారు.ఆడియన్స్ నా వర్క్ లైఫ్ గురించి మాట్లాడితే హ్యాపీ అని ఆమె కామెంట్లు చేశారు.వైజాగ్ నుంచి ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారని శోభిత అభిప్రాయం వ్యక్తం చేశారు.ఎన్నో అడిషన్స్ ఇచ్చిన తర్వాత ఒక సినిమాలో నాకు ఛాన్స్ దక్కిందని ఆమె కామెంట్లు చేశారు.
ఆరోజునుంచి ఈరోజు వరకు శ్రమిస్తూనే ఉన్నానని శోభిత అన్నారు.
శోభిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.శోభిత కోరుకున్న వ్యక్తి భర్తగా దొరుకుతాడో లేదో చూడాల్సి ఉంది.శోభిత పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
సినిమా సినిమాకు శోభిత రేంజ్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.హీరోయిన్ శోభితను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.