1.కెసిఆర్ పై పోటీ చేస్తా : గద్దర్
ప్రజా గాయకుడు గద్దర్ కొత్త రాజకీయ పార్టీ ‘ గద్దర్ ప్రజా పార్టీ ‘ పేరును ప్రకటించారు.రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని ఈ సందర్భంగా గద్దర్ ప్రకటించారు.
2.చంద్రబాబుపై సోము వీర్రాజు ఆగ్రహం
మాది గల్లి పార్టీ కాదు అని, మీ పద్ధతి మార్చుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
3.రఘురామ కృష్ణంరాజు విమర్శలు
జగన్ ప్రశాంత్ కిషోర్ల డైరెక్షన్ లోనే ఏపీలో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని నరసాపురం వైసిపి ఎంపీ రఘురాం కృష్ణంరాజు విమర్శించారు.
4.అందుబాటులోకి ఏఎంవీఐ హాల్ టికెట్లు
తెలంగాణలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి.వీటిని అధికారిక వెబ్సైట్ లో టిఎస్పిఎస్సి అందుబాటులో ఉంచింది.
5.నేడు రేపు పలు రైళ్ల రద్దు
ఖరగ్పూర్ డివిజన్ లో భద్రతాపరమైన పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డిసీఎం ఎస్ కె త్రిపాటి తెలిపారు.
6.డిగ్రీ కోర్సులు ప్రవేశాలకు నోటిఫికేషన్
ఏపీలో డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2023 – 24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం డిగ్రీ కాలేజీలు సాధారణ డిగ్రీ కోర్సులు సీట్లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.
7.మహేష్ అర్బన్ బ్యాంకుకు జరిమానా
ఖాతాదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కల్పించి, సైబర్ భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోని ఏపీ మహేష్ సహకార అర్బన్ బ్యాంకుకు 65 లక్షల జరిమానా విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వులు జారీ చేసింది.
8.భట్టి విక్రమార్క కు వైద్య పరీక్షలు
సీఎల్పీ నేత బట్టి విక్రమార్కకు మరోసారి వైద్య పరీక్షలు చేశారు.97వ రోజు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన వడదెబ్బకు గురవడంతో ఈ పరీక్షలు నిర్వహించారు.దీంతో పాదయాత్రను ఆయన రద్దు చేసుకున్నారు.
9.మోడీ పాలనపై మేధావుల సమావేశం
నేడు అనకాపల్లిలో మోడీ పాలనపై మేధావులు సమావేశం నిర్వహించారు.
10.పవన్ వారాహి యాత్ర పొడిగింపు
గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పర్యటనను మరో రెండు రోజులు పొడిగించారు.
11.ఒంగోలులో అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఒంగోలులో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.దీనికి ముఖ్యఅతిథిగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు.
12.విశాఖ ఫోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో .
విశాఖ పోర్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది.దీనికి ముఖ్యఅతిథిగా పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ హాజరయ్యారు.
13.బండి సంజయ్ పర్యటన
మంచిర్యాల జిల్లాలో నేడు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటిస్తున్నారు.
14. పొంగులేటి తో అనుచరుల భేటీ
నేడు హైదరాబాద్ లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఆయన అనుచరులు భేటీ అవుతున్నారు.కాంగ్రెస్ లో చేరికపై అనుచరులకు ఆయన క్లారిటీ ఇవ్వబోతున్నారు.
15.కేటీఆర్ పర్యటన
నేడు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటిస్తున్నారు.వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కేటీఆర్ చేయనున్నారు.
16.సోము వీర్రాజుకు నిరసన సెగ
బాపట్ల జిల్లా చీరాలలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు నిరసన సభ తగిలింది .ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, అంశాన్ని ఏం చేశారు అంటూ సభలో కొంతమంది ప్ల కార్డులు ప్రదర్శించారు.
17.ఏపీకి భారీ వర్ష సూచన
ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
18.రేపు హైదరాబాద్ లో పార్కులు బంద్
హైదరాబాదులో గురువారం పార్కులను మూసివేయనున్నట్లు హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు.
19.పవన్ ఖచ్చితంగా సీఎం అవుతారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కచ్చితంగా సీఎం అవుతారని నిర్మాత నట్టి కుమార్ వ్యాఖ్యానించారు.
20.ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ బహిష్కరణ
కే ఏ పాల్ రాజకీయ పార్టీ ప్రజాశాంతి నుంచి ప్రజా గాయకుడు గద్దర్ బహిష్కరణకు గురయ్యారు.