16 కోట్ల హవాలా డబ్బు విషయంలో నాగర్ కర్నూల్ కు చెందిన వ్యక్తి కిడ్నాప్...!

ఇటీవలే చాలామంది కష్టపడకుండా సంపాదించే మార్గాలను ఎంచుకొని ఘోరంగా మోసపోతున్నారు.అధిక లాభాల పేరుతో అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

 Man Kidnapped For 16 Crores Hawala Money In Nagar Kurnool Details, Man Kidnapped-TeluguStop.com

ఇలాంటి కోవలోనే ఒక వ్యక్తి విదేశాల నుండి వచ్చే హవాలా డబ్బు (బ్లాక్ మనీ) కు ఆశపడడంతో పాటు ఇతరులతో కూడా పెట్టుబడి పెట్టించి నిండా మునిగిపోయాడు.చివరికి ఆ వ్యక్తి కిడ్నాప్ ( Kidnap ) గురయ్యాడు.

ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలో( Nagar Kurnool ) ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని శ్రీపురం చౌరస్తాలో లక్ష్మణ్( Lakshman ) అనే వ్యక్తి హెయిర్ సెలూన్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.లక్ష్మణ్ యొక్క అన్న మాజీ ఆర్మీ ఉద్యోగి.అయితే తన అన్న ద్వారా ఢిల్లీలోని ఒక వ్యక్తి పరిచయమయ్యాడు.లక్ష రూపాయలు పెట్టుబడితే చాలు ప్రతినెల రూ.25 వేలు అకౌంట్లో పడతాయని నమ్మించాడు.

Telugu Hawala, Black, Kidnap, Lakshman, Kidnapped, Nagar Kurnool, Mangamma-Lates

లక్ష్మణ్ పెట్టుబడి పెట్టడంతో పాటు స్థానికంగా ఉండే ఫైనాన్స్ వ్యాపారులు, రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల అనుచరులు, ఇతర వ్యాపారాలు చేసే వారి నుంచి ఏకంగా రూ.16 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించాడు.అయితే గత రెండు నెలలుగా పెట్టుబడి పెట్టిన వారి అకౌంట్లో కమిషన్ డబ్బులు జమ కాలేదు.దీంతో పెట్టుబడి పెట్టిన వారంతా లక్ష్మణ్ ను తీవ్రంగా ఒత్తిడి చేశారు.

దీంతో లక్ష్మణ్ అన్న మాజీ ఆర్మీ ఉద్యోగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.ఈ విషయం తెలిసిన పెట్టుబడిదారులంతా ఆదివారం లక్ష్మణ్ ను గట్టిగా నిలదీశారు.

ఇక ఆ రోజు నుండి లక్ష్మణ్ అదృశ్యమయ్యాడు.

Telugu Hawala, Black, Kidnap, Lakshman, Kidnapped, Nagar Kurnool, Mangamma-Lates

లక్ష్మణ్ కనిపించడం లేదని అతని భార్య మంగమ్మ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.తన భర్తను స్థానికులే కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపణలు చేసింది.పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి నగరంలో ఉండే సీసీటీవీ కెమెరాల ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరొకవైపు లక్ష్మణ్ పెట్టుబడి పెట్టించిన వారందరినీ విచారిస్తున్నారు.అయితే కొందరు పోలీసుల వ్యవహార శైలిపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube