అధిక బరువు( Overweight ) సమస్యతో బాగా సతమతం అవుతున్నారా.? వారు వీరు చెప్పిన డైట్ ను ఫాలో అయ్యి విసిగిపోయారా.? ఎలా సులభంగా బరువు తగ్గాలో తెలియడం లేదా.? అయితే ఇకపై అస్సలు వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే ఎనిమిది సూత్రాలు పాటిస్తే ఎంత లావుగా ఉన్న వారైనా చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఎనిమిది సూత్రాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

గ్రీన్ టీ.( Green Tea ) వెయిట్ లాస్ కు బెస్ట్ డ్రింక్ అని చెప్పవచ్చు.మెటబాలిజం రేటును ఇంప్రూవ్ చేసి క్యాలరీలను త్వరగా కరిగించడానికి గ్రీన్ టీ అద్భుతంగా సహాయపడుతుంది.అందుకే బరువు తగ్గాలని భావించేవారు రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ ను తీసుకోవాలి.
అలాగే భోజనానికి అరగంట ముందు కచ్చితంగా ఒకటి లేదా రెండు గ్లాసుల వాటర్ ను తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల కడుపు సగం ఫిల్ అవుతుంది.
దాంతో భోజనం తక్కువగా తింటారు.

వెయిట్ లాస్( Weight Loss ) అవ్వాలంటే శరీరానికి శ్రమ ఉండాలి.అందుకే రోజుకు కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు వాకింగ్, రన్నింగ్ ఇలా ఏదో ఒక వ్యాయామం చేయాలి.
చాలా మంది వెనక ఎవరో తరుముతున్నట్టు భోజనాన్ని గబగబా తినేస్తుంటారు.
కానీ అలా చేయకండి.భోజనాన్ని బాగా నమిలి నెమ్మదిగా తినండి.
దీంతో తిన్నది త్వరగా అరుగుతుంది.అదే సమయంలో బాగా నమిలి తినడం వల్ల ఎక్కువ భోజనాన్ని కూడా తినలేరు.

ఫాస్ట్ ఫుడ్స్( Fastfoods ) కు బాగా అలవాటు పడ్డారా.? అయితే మీరు ఎన్ని చేసినా బరువు తగ్గరు.కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలంటే ముందు ఫాస్ట్ ఫుడ్స్ ను కట్ చేయండి.
డైట్ లో పైనాపిల్, గ్రేప్స్, ఆపిల్ వంటి ఫ్రూట్స్ ను ఉండేలా చూసుకోండి.
ఫ్రూట్స్( Fruits ) హెల్త్ పరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అలాగే వెయిట్ లాస్ కు కూడా ఎంతగానో సహకరిస్తాయి.
వెయిట్ లాస్ అవ్వాలని భావించేవారు తమ డైట్ లో ప్రోటీన్, ఫైబర్.ఈ రెండు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
ఇవి సులభంగా బరువు తగ్గడానికి సూపర్ ఎఫెక్టివ్ గా హెల్ప్ చేస్తాయి.

ఇక షుగర్, షుగర్ తో చేసిన ఆహారాలు, సాఫ్ట్ డ్రింక్స్( Soft Drinks ) వంటివి పూర్తిగా అవాయిడ్ చేయాలి.ఎందుకంటే ఇవి ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా క్యాలరీలను కూడా పెంచుతాయి.కాబట్టి వీటికి దూరంగా ఉంటే సులభంగా బరువు తగ్గుతారు.