వైరల్: రెస్టారెంటులో గుద్దులాట... సిబ్బందికి ఓ కుటుంబానికి, ఎందుకంటే?

సోషల్ మీడియా అనేది అందుబాటులోకి రాకపోతే మనకు చాలా విషయాలు తెలిసేవి కావు.ఇది అందరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత దేశం నలుమూలలా ఏం జరుగుతోందో తెలుసుకోగలుగుతున్నాం.

 Clash Between Restaurant Staff And Customers Over Service Charge In Noida Detail-TeluguStop.com

ఈ క్రమంలో అనేక వీడియోలు మనల్ని అలరిస్తూ ఉంటాయి.అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని చిత్ర విచిత్రంగా ఉంటాయి.

కొన్ని ఆశ్చర్యంగా ఉంటే మరికొన్ని భయానకంగా ఉంటాయి.తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి చూస్తే, రెస్టారెంటులో( Restaurant ) ఓ కుటుంబం పుష్టిగా భోజనం చేసింది.అనంతరం రెస్టారెంట్ సిబ్బంది బిల్లు ( Bill ) వారి చేతిలో పెట్టారు.కట్ చేస్తే ఆ కుటుంబం ఆ బిల్లుని చూసి మూర్ఛపోయింది.కారణం ఏమంటే అందులో సర్వీస్ ఛార్జి.( Service Charge ) అవును, ఈ విషయంపై ఆ కుటుంబ సభ్యులు, రెస్టారెంట్ సిబ్బంది గొడవపడ్డారు.ఎంతలా గొడవకు దిగారంటే… చివరకు వారంతా కలిసి రెస్టారెంటులోనే కొట్టుకునే వరకు వెళ్లింది ఈ తతంగం.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ ఘటన చోటుచేసుకోగా దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇపుడు స్పీడుగా వైరల్ అవుతోంది.

అక్కడ స్థానికంగా వున్న స్పెక్ట్రమ్ మాల్ కు( Spectrum Mall ) వచ్చిన ఆ కుటుంబం హాయిగా తిని వీకెండ్ ని ఎంజాయ్ చేద్దామనుకుంది.కానీ వారికి అక్కడ బిల్ రూపంలో చేదు అనుభవం ఎదురైంది.దాంతో రెస్టారెంట్ బౌన్సర్లు, ఆ కుటుంబంలోని వారు పరస్సరం తిట్టుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకున్నారు.

వారిలో మహిళలు కూడా ఉండడం కొసమెరుపు.కాగా ఆ ఫైటింగ్ ని ఆపడానికి కొందరు ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఫలించలేదు సరికదా గొడవను ఆపుదామనుకొనేవారికి కూడా దెబ్బలు తగిలినట్టు తెలుస్తోంది.

దాంతో రెస్టారెంటులో గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారు.సర్వీస్ ఛార్జితో కలిపి బిల్ ఇచ్చినందుకు కుటుంబ సభ్యులు గొడవ పెట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

తప్పు ఎవరిదో తేల్చి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube