టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన రష్మిక( Rashmika Mandanna )కు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే.రష్మిక ఈ మధ్య కాలంలో తెలుగులో ఎక్కువగా కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించకపోవడం వెనుక కూడా అసలు కారణం ఇదేనని తెలుస్తోంది.
తాజాగా యానిమల్ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూట్ ను పూర్తి చేసిన రష్మిక ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ పెట్టగా ఆ స్టోరీ నెట్టింట తెగ్ వైరల్ అవుతుండటం గమనార్హం.
ఇకపై పుష్ప2( Pushpa 2 ) మూవీ షూటింగ్ లో తాను పాల్గొంటానని రష్మిక చెప్పుకొచ్చారు.రణ్ బీర్( Ranbir ) చాలా స్పెషల్ పర్సన్ అని చాలా గ్రేట్ పర్సన్ అని ఆమె కామెంట్లు చేశారు.దేవుడు అలా ప్రత్యేకంగా సమయం తీసుకుని రణ్ బీర్ ను తయారు చేశాడంటూ రష్మిక ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ మధ్య కాలంలో రష్మిక ఈ స్థాయిలో పొగిడిన వ్యక్తి రణ్ బీర్ మాత్రమే అని ఇంతలా హీరోను పొగడాల్సిన అవసరం ఏముందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు రష్మిక పారితోషికం భారీగానే ఉండగా పుష్ప1 సక్సెస్ తో భాషతో సంబంధం లేకుండా రష్మికకు పాపులారిటీ పెరిగింది.రష్మిక విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda )గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఈ వార్తల్లో ఏది నిజమో ఏది అబద్ధమో అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.రష్మికకు వరుస సక్సెస్ లు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
నితిన్ కు జోడీగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఒక సినిమాకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.వెంకీ కుడుముల( Venky Kudumula ) డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ లకు రష్మిక జోడీగా నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.