సూర్యాపేట జిల్లా:రాష్ట్ర రైతాంగానికి 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) హామీ ఇచ్చిన లక్ష రూపాయలు లోపు రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ కే.యాకూబ్ డిమాండ్ చేశారు.
మంగళవారం గరిడేపల్లి తాహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తాహాసిల్దార్ కార్తీక్ కు వినతిపత్రం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ( Crop Loan Waiver Scheme ) హామీనాలుగున్నర ఏళ్లు గడుస్తున్నా అమలుకునోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రుణమాఫీ కాక కొత్త రుణాలు ఇవ్వక అప్పులు చేసి అన్నదాతలు ఆర్థికగా చితికిపోతున్నారని వాపోయారు.రాష్ట్ర వ్యాప్తంగా రూ.13500 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందని వెంటనే వాటిని మాఫీ చేసి కొత్త రుణాలు ఇప్పించాలని కోరారు.వర్షా కాలం సీజన్ దగ్గరకొచ్చి రైతులు( Farmers ) బ్యాంకు దగ్గరికి వెళితే బ్యాంకు వాళ్లు పాత రుణమాఫీ కట్టలేదని అంటున్నారని,కో-ఆపరేటివ్ బ్యాంకు వాళ్ళని అడిగితే పైపు లైన్ కోసం లోన్లు ఇచ్చామని అంటున్నారన్నారు.
మండల కేంద్రంలోని నాలుగు కోపరేటివ్ బ్యాంకులో ఉన్నాయని, ఒక బ్యాంకులో రెండు కోట్ల ఫ్రాడ్ జరిగిందని,రైతన్న కోసం వచ్చేసరికి చప్పుడు చేయకపోవడం సరైన పద్ధతి కాదన్నారు.రైతుబంధు రూ.650 కోట్లు అమెరికా ఎన్నారైలకు కూడా పడుతుందని, భూమిపై చాకిరీ చేసే రైతుకు ఏమీ లాభం జరిగిందన్నారు.సాగర్ ఆయకట్టులో పదిరోజుల్లో వ్యవసాయానికి సిద్ధం కాబోతున్న నేపథ్యంలో ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు,రైతులు పాల్గొన్నారు.







