టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రానా( Rana ) దగ్గుబాటి ఒకరు.లీడర్ ( Leader ) సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు.
మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి తన అనంతరం ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు.అయితే ఈయన హీరోగా మాత్రమే కాకుండా కథ ప్రాధాన్యత ఉంటే విలన్ పాత్రలలో కూడా నటించి సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే రానా ఇదివరకు బాహుబలి( Bahubali) సినిమాలో విలన్ పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇలా బాహుబలి సినిమాలో విలన్( Villan ) గా నటించినటువంటి రానా అనంతరం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా నటించిన భీమ్లా నాయక్( Bheemla Nayak ) సినిమాలో కూడా ఈయన డానియల్ శేఖర్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.ఇలా విలన్ గా రానా ( Rana )ఎంతో అద్భుతంగా సెట్ అయ్యారనే చెప్పాలి.అయితే తాజాగా మరోసారి విలన్ గా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ( Nikhil )హీరోగా నటిస్తున్న స్పై సినిమా ( Spy Movie ) త్వరలోనే విడుదల కానున్న విషయం మనకు తెలిసిందే.జూన్ 29వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఒక కీలక సన్నివేశంలో రానా విలన్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.రానా పాత్ర ఈ సినిమాని కీలక మలుపు తిప్పబోతుందని సమాచారం.మరి ఈ సినిమా ద్వారా రానా ఎలా ప్రేక్షకులను నేర్పిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.







