సాధారణంగా కొందరికి శరీర రంగు తో పోలిస్తే ముఖం రంగు కాస్త తక్కువగా ఉంటుంది.ఇందుకు కారణాలు అనేకం అయినప్పటికీ.
చాలా మంది ముఖ చర్మాన్ని తెల్లగా మార్చుకునేందుకు మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్ లను( Skin Whitening Cream ) కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో పక్కన పెడితే.
ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ నైట్ క్రీమ్ ను ( Home Made Night Cream ) వాడితే కనుక మీ ముఖం ఎంత నల్లగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే సూపర్ వైట్ గా, బ్రైట్ గా మారుతుంది.మరి ఇంకెందుకు లేటు ఆ నైట్ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) మరియు వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ) వేసి బాగా కలుపుతూ ఉడికించాలి.జెల్లీ స్ట్రక్చర్ వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు పల్చటి వస్త్రం సహాయంతో కాఫీ జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జెల్ లో వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ తో పాటు వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ను వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన నైట్ క్రీమ్ సిద్ధం అవుతుంది.
ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ నైట్ క్రీమ్ ను ప్రతిరోజు కనుక వాడితే స్కిన్ టోన్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.కొద్ది రోజుల్లోనే మీ చర్మం తెల్లగా షైనీ గా మెరుస్తుంది.
అలాగే ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను వాడటం వల్ల చర్మం టైట్ గా, బ్రైట్ గా మారుతుంది.ముడతలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.కాబట్టి స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేసుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ నైట్ క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.