మెగా కుటుంబం(Mega Family) లో పెద్దఎత్తున సంబరాలు జరుగుతున్నాయి.10 సంవత్సరాల తర్వాత మెగా వారసురాలు మెగా ఇంట్లోకి అడుగుపెట్టడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.చిరంజీవి (Chiranjeevi) మరోసారి తాతయ్యగా ( Grand Father) మారిపోయారు.ఇప్పటికే చిరంజీవి కూతుర్లు ఇద్దరికీ కూడా కుమార్తెలు జన్మించిన విషయం మనకు తెలిసిందే.తాజాగా చిరంజీవి కుమారుడు హీరో రామ్ చరణ్ (Ram Charan)కి కూడా కుమార్తె (Baby Girl) జన్మించారు.నేడు ఉదయం తెల్లవారుజామున ఉపాసన (Upasana) హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో పండంటి పాపాయికి జన్మనిచ్చారు.
ఈ విధంగా ఉపాసన బిడ్డకు జన్మనిచ్చారని తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు అంటూ అపోలో హాస్పిటల్ వైద్యులు తెలియజేశారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఉపాసన రాంచరణ్ దంపతులతో పాటు మెగాస్టార్ చిరంజీవికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఉపాసన పాపకు జన్మనిచ్చారనే విషయం తెలియడంతో మెగా ఫ్యామిలీ అందరూ కూడా అపోలో హాస్పిటల్ చేరుకున్నారు.
ఇక అపోలో హాస్పిటల్ బయట పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని సంగీత వాయిద్యాల నడుమ సంబరాలు జరుపుతున్నారు.అలాగే హార్ట్ షేప్ బెలూన్స్ అన్నింటిని కూడా గాలిలో విసురుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ విధంగా అపోలో హాస్పిటల్ ముందు అభిమానులు చేసిన హంగామాకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక రాంచరణ్ ఉపాసన దంపతులకు పెళ్లయిన పది సంవత్సరాల తర్వాత కుమార్తె జన్మించడంతో సాక్షాత్తు మెగా ఇంట్లోకి మహాలక్ష్మి అడుగు పెట్టిందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.