టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్,( Prabhas ) కృతి సనన్( Kriti Sanon ) జంటగా నటించిన తాజా చిత్రం ఆదిపురుష్.( Adipurush ) రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్గా విడుదల అయ్యి కోట్లలో కలెక్షన్స్ ను రాబడుతూ రికార్డుల మోత మోగిస్తూ దూసుకుపోతోంది.
కాగా సోషల్ మీడియాలో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.కేవలం వీఎఫ్ఎక్స్‌తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి గెటప్ సరిగా లేదని విమర్శలు వినిపించాయి.
అలాగే సినిమాలోని కొన్ని డైలాగ్స్‌పైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా మూవీలోని డైలాగ్స్ పై వస్తున్న విమర్శలపై ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతషీర్ శుక్లా( Writer Manoj Muntashir ) స్పందించారు.
ప్రేక్షకుల భావోద్వేగాలను గౌరవిస్తానని.వారిని బాధపెట్టేలా ఉన్న డైలాగులను తొలగిస్తామని ట్వీట్ చేశారు.ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు.ప్రతి ఒక్కరి భావోద్వేగాన్ని గౌరవించడం రామాయణంలో నేర్చుకోవలసిన మొదటి పాఠం.
ఆదిపురుష్ కోసం చాలా డైలాగ్స్ రాశాను.కానీ కొన్నింటి దగ్గర సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి.
నేను సీత, రాముని కోసం రాసిన డైలాగ్స్‌కు ప్రశంసలు దక్కలేదు.నా సొంత సోదరులే సోషల్ మీడియాలో నాపై, నా తల్లిపై అసభ్యకరమైన పదాలు వాడారు.

ప్రతి తల్లిని తన తల్లిగా భావించే శ్రీరాముడిని చూసిన సోదరులకు హఠాత్తుగా ఎందుకంత కోపం వచ్చింది.కానీ నాపై సనాతన ద్రోహి అనే ముద్ర వేసేందుకు మీరు ఎందుకు తొందరపడ్డారో తెలియడం లేదు.మేము సనాతన సేవ కోసమే ఆదిపురుష్ మూవీని సృష్టించాము.నా డైలాగ్స్‌కు నేను లెక్కలేనన్ని వాదనలు ఇవ్వగలను.కానీ ఇది మీ బాధను తగ్గించలేదు.కొన్ని డైలాగులు మిమ్మల్ని బాధపెట్టాయని గ్రహించిన నేను సినిమా నిర్మాత, దర్శకుడితో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాను.

ఈ వారంలోనే అభ్యంతరకరంగా ఉన్న డైలాగ్స్‌లో మార్పులు చేస్తాం అని రాసుకొచ్చారు మనోజ్.కాగా ఆయన ట్వీట్ పై స్పందిస్తూ మా బాధను అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అని కొందరు కామెంట్స్ చేయగా ఇంకొందరు చేసిన తప్పును అంగీకరించి ఇలా ఒకరి మనసు నొచ్చుకోకుండా ట్వీట్ చేసారు అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.ఇంకొందరు ఈ విషయంపై స్పందిస్తూ మూవీ బాగా లేకపోతే ట్రోల్స్ చేయాలి కానీ తల్లిదండ్రులను ఫ్యామిలీని తిట్టడం మంచిది కాదని కామెంట్ చేస్తున్నారు.







