ఆడబిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ - ఉపాసన..రాష్ట్ర వ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయిన ఫ్యాన్స్

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం వచ్చేసింది.పదేళ్ల తర్వాత తల్లితండ్రులు అవ్వాలని నిర్ణయించుకున్న ఉపాసన మరియు రామ్ చరణ్, గత ఏడాదిలోనే మెగాస్టార్ చిరంజీవి చేత అభిమానులకు శుభవార్తని తెలియచేయించాడు.

 Ram Charan And Upasana Blessed With A Baby Girl,ram Charan,upasana Konidela,soci-TeluguStop.com

అప్పటి నుండి మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలిపోయారు.ఎప్పుడెప్పుడు రామ్ చరణ్ బిడ్డ ఈ భూమి మీదకు అడుగుపెడుతాడా అని ఆతృతగా ఎదురు చూసారు.

శుభవార్త వినడం కోసం చిరంజీవి కుటుంబ సభ్యులు ఎంతలా అయితే ఎదురు చూసారో, అంతకంటే ఎక్కువగా ఎదురు చూసారు.చివరకి ఆ శుభవార్త వినేరోజు రానే వచ్చింది.

నిన్న ఉదయం నుండే రేపు రామ్ చరణ్ – ఉపాసన( Ram Charan-Upasana ) మొదటి బిడ్డకి జన్మని ఇవ్వబోతున్నారని వార్త బయటకి వచ్చేసింది.ఇంత అకస్మాత్తుగా ఏంటి, ఫేక్ న్యూస్ ఏమో అని అందరూ అనుకున్నారు, కానీ చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కారణం స్వామి నాయుడు స్వయంగా రామ్ చరణ్ – ఉపాసన దంపుతులు రేపు మొదటి బిడ్డకి జన్మని ఇవ్వబోతున్నారని ప్రకటించాడు.

Telugu Apollo, Fans, Chiranjeevi, Ram Charan-Latest News - Telugu

నిన్న సాయంత్రమే ఉపాసన ని రామ్ చరణ్ అపోలో హాస్పిటల్( Apollo Hospital ) కి తీసుకొచ్చాడు, దానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యింది.కాసేపటి క్రితమే రామ్ చరణ్ కి ఆడబిడ్డ( Ram Charan Daughter ) జన్మించారు అనే న్యూస్ రావడం తో మెగా అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి.ఇక రామ్ చరణ్ మరియు ఉపాసన కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు రామ్ చరణ్ ఫ్యాన్స్ రేపు పెద్ద ఎత్తున ఫిలిం నగర్ లోని అపోలో హాస్పిటల్స్ కి చేరుకోబోతున్నారు.మరి రామ్ చరణ్ తన బిడ్డని అభిమానులకు చూపిస్తాడో లేదో చూడాలి, ఒకవేళ చూపిస్తే మాత్రం సోషల్ మీడియా( Social Media ) రేపు మామూలు రేంజ్ లో ఉండదని చెప్తున్నారు ఫ్యాన్స్.

ఇక రామ్ చరణ్ బిడ్డ కలకలం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించబోతున్నారు.

Telugu Apollo, Fans, Chiranjeevi, Ram Charan-Latest News - Telugu

కొడుకు తండ్రి అయ్యాడనే వార్త మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కి ఎంత సంతోషాన్ని ఇచ్చి ఉంటుందో ఊహించు కొనవచ్చును.కొడుకు తనకంటే కూడా ఎక్కువ రేంజ్ కి వెళ్ళాడు, పాన్ వరల్డ్ రేంజ్( Pan World ) లో గుర్తింపు ని దక్కించుకున్నాడు, ఇప్పుడు ఒక బిడ్డకు జన్మని ఇచ్చాడు.ఆయన మిగిలిన ఇద్దరు కూతుర్లు ఎలా ఉన్నా, కొడుకు విషయం లో మాత్రం చిరంజీవి ఎంతో గర్వం గా ఫీల్ అవుతుంటాడు.

రామ్ చరణ్ గురించి మాట్లాడినప్పుడల్లా చిరంజీవి లో పుత్రోత్సాహం పొంగిపోవడం మనం గమనించొచ్చు.ఇక రేపు ఆయన ఎంత ఆనందిస్తాడో చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube