మహేష్ బాబు తో తీవ్రమైన గొడవలు..'గుంటూరు కారం' నుండి థమన్ అవుట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘గుంటూరు కారం'( Guntur Karam ) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే.గత కొంతకాలం క్రితమే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమా , మహేష్ బాబు( Mahesh Babu ) సమ్మర్ కారణం గా కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీ తో కలిసి వరల్డ్ టూర్ వెళ్ళాడు.

 Music Director Thaman Out From Mahesh Babu Guntur Karam,mahesh Babu,trivikram,th-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని గత కొంతకాలం క్రితమే కృష్ణ జయంతి రోజు విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ టీజర్ కి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి విశేషమైన స్పందన లభించింది.

ఇదంతా కాసేపు పక్కన పెడితే ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న థమన్ కి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కి మధ్య పెద్ద గొడవ అయ్యిందట.

Telugu Allu Arjun, Guntur Karam, Mahesh Babu, Sreeleela, Thaman, Thaman Music, T

ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ నాన్ స్టాప్ గా జులై నుండి షెడ్యూల్స్ ని ప్లాన్ చేసాడు త్రివిక్రమ్( Trivikram Srinivas ).అయితే మొదట ప్రారంభం అయ్యే షెడ్యూల్ లో మహేష్ మరియు శ్రీలీల( Sreeleela ) మీద ఒక పాట షూటింగ్ చెయ్యాలి.పాట కి అంతా సిద్ధం చేసుకున్న తర్వాత థమన్ ట్యూన్ ఇవ్వడం ఆలస్యం అయ్యింది.

అయితే ఎట్టకేలకు ఈరోజు ట్యూన్ ని ఫైనలైజ్ చేసి పంపించాడట.అది మహేష్ బాబు కి వినిపించిన తర్వాత ఆయనకీ అసలు నచ్చలేదు.

షూటింగ్ ప్రారంభమైన రోజు నుండి త్రివిక్రమ్ పై మహేష్ బాబు థమన్ ని తొలగించాల్సిందిగా ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు.కానీ మహేష్ బాబు ని త్రివిక్రమ్ ఎదో ఒక విధంగా సర్ది చెప్పి ఒప్పించి ఇన్ని రోజులు లాక్కొచ్చాడు.

అయితే ఇంత ఆలస్యం గా ట్యూన్స్( Thaman Tunes ) ఇవ్వడమే కాకుండా, క్వాలిటీ పరంగా ఏమాత్రం నాణ్యత లేకపోవడం తో మహేష్ బాబు త్రివిక్రమ్ మరియు థమన్ ఇద్దరి పై ఫైర్ అయ్యి థమన్ ని తొలగించాల్సిందిగా చాలా బలంగా చెప్పాడట.

Telugu Allu Arjun, Guntur Karam, Mahesh Babu, Sreeleela, Thaman, Thaman Music, T

దీనితో త్రివిక్రమ్ కి వేరే దారి లేక థమన్ ని ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించాడు , ఆ తర్వాత ఆయన హర్ట్ అవ్వకుండా ఉండేందుకు, త్వరలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) తో ఒక సినిమా చేయబోతున్నామని, ఈ ప్రాజెక్ట్ కి థమన్ సంగీతం అందించబోతున్నాడని ఒక అధికారిక ప్రకటన చేసారు.ఇక ఆ తర్వాత థమన్ సోషల్ మీడియా లో మహేష్ బాబు పై చాలా తీవ్రంగా విరుచుకుపడ్డాడు.మహేష్ పేరు ని ప్రస్తావించకుండా, పరోక్షంగా ఆయన పై సెటైర్ల మీద సెటైర్లు వేసాడు.

సోషల్ మీడియా లో అందరూ థమన్ ప్రవర్తన చూసి చాలా షాక్ కి గురయ్యారు.మరి దీనికి మహేష్ నుండి రియాక్షన్ ఉంటుందో లేదో చూడాలి.ఇక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న తర్వాత జీవీ ప్రకాష్ కుమార్ కానీ, లేదా అనిరుధ్ కానీ ఈ సినిమాకి సంగీతం అందించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది, చూడాలిమరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube