నెలాఖరు వరకు రూ.లక్ష బీసీ పథకం గడువు పొడగించాలి:సిపిఎం పార్టీ డిమాండ్

వెనుకబడిన వర్గాల లక్ష రూపాయలపథకం గడువు మంగళవారం నాటితో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు పొడగించాలని సీపీఐ( CPI ) (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

 The Deadline Of Rs.1 Lakh Bc Scheme Should Be Extended Till The End Of The Month-TeluguStop.com

ఇప్పటికీ అత్యధికులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో పథకానికి అప్లై చేసుకోలేక పోయారని తెలిపారు.ఈ ధ్రువీకరణ పత్రాల కోసం తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని పేర్కొన్నారు.

మీ సేవలో దరఖాస్తు చేసి తహసిల్దార్( Tehsildar ) కార్యాలయంలోని బాక్సుల్లో వేస్తే రోజుల తరబడి ఆ పెట్టెలు తెరిచే పరిస్థితి లేకుండా వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు.మరోవైపు ఈ పథకం గడువు సమీపిస్తుండడంతో దరఖాస్తుదారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుండడంతో విద్యార్థుల సర్టిఫికెట్లను పక్కకు పెట్టి ఈ దరఖాస్తుల మీదనే రెవెన్యూ సిబ్బంది దృష్టి కేంద్రీకరిస్తున్నారని పేర్కొన్నారు.

రూ లక్ష బీసీ పథకం గడువు తేదీ పొడిగిస్తే విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి వీలవుతుందని సూచించారు.దీనికి తోడు రూ.లక్ష పథకం విషయంలో పైరవీలు కూడా ఊపందుకున్నట్లు తెలుస్తోందని, అధికారులు దీనిపై దృష్టి సారించి నిజమైన అర్హులకి లబ్ధి చేకూరేలా చూడాలని కోరారు.అధికార పార్టీ కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు పదుల సంఖ్యలో దరఖాస్తులు తీసుకువస్తే వెంటనే సైట్ ఓపెన్ చేసి వాటిని క్లియర్ చేస్తున్న అధికారులు, పైరవీలు లేని అప్లికేషన్లను మాత్రం రోజుల తరబడి పెండింగ్లో పెడుతుండడం సరికాదని నున్నా పేర్కొన్నారు.

బీసీ పథకం దరఖాస్తుల గడువు పొడిగిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉన్న దృష్ట్యా తక్షణం ఈ నెలాఖరు వరకు పొడిగించాల్సిందిగా కోరారు.‌

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube