వెండితెర చందమామగా ఎంతో మంచి గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా నేడు కాజల్ అగర్వాల్ పుట్టినరోజు ( Birthday ) సందర్భంగా ఆమె కొత్త సినిమాని కూడా ప్రకటించారు.
ఈమె సత్యభామ( Satyabhama ) అనే మరో లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఇకపోతే ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ ( Remuneration ) ప్రస్తుతం సంచలనంగా మారింది.
భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చారు.

కాజల్ అగర్వాల్ రెండు సంవత్సరాల క్రితం తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్( Gautham ) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.వీరి వివాహం అయిన వెంటనే కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ కావడంతో ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఒకబాబుకి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ విధంగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2(Indian 2) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమాతో పాటు బాలకృష్ణ( Balakrishna ) సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్నటువంటి భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు తాజాగా ఈమె అఖిల్ దర్శకత్వంలో సత్యభామ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ ఏకంగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.







