కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను జూలై 3వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.అయితే అవినాశ్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా ఈ పిటిషన్ పై సునీతా తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు విన్న ధర్మాసనం అవినాశ్ రెడ్డితో పాటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.