సాధారణంగా మగవారు కొట్లాడుతున్నప్పుడు వారి మధ్యలోకి వెళ్లి ఆపడానికి ప్రయత్నించొచ్చు కానీ ఆడవాళ్ళ విషయంలో ఎప్పుడూ జోక్యం చేసుకోకూడదు.అలా కాదని వారి మధ్యలో దూరితే వీపు విమానం మోత మోగుతుంది.
ఎందుకు ఆపేవారు ఎవరన్నది ఆడవాళ్లు అసలు చూడరు.ఎలా పడితే అలా కొట్టేస్తారు.
ఈ విషయం తెలియని ఒక లాయర్( Lawyer ) తాజాగా మహిళల మధ్యలోకి వెళ్లి తాను కూడా దెబ్బలు తిన్నాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
దీన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.మరి కొంతమంది మాత్రం లాయర్ పట్ల అయ్యో పాపం అని సానుభూతి చూపిస్తున్నారు.

ఈ సంఘటన లక్నో ఫ్యామిలీ కోర్టులో( Lucknow Family Court ) చోటు చేసుకుంది.ఒక కేసు విషయమై ఇరు పార్టీల మహిళలు న్యాయస్థానానికి( Court ) వచ్చారు.ఆ సమయంలో ఆ మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.చివరికి వారు జుట్టు జుట్టు పట్టుకొని ఒకరికొకరు కొట్టుకున్నారు.వారిని ఆపేందుకు లాయర్ ప్రయత్నించాడు.ఆ సమయంలో వారు లాయర్ ని కూడా కొట్టేందుకు చేయి లేపడం వీడియోలో కనిపించింది.
అయితే వారి మధ్య వాగ్వాదానికి దారి తీసిన కారణమేంటనేది తెలియదు.బహుశా కోర్టు తీర్పు నచ్చని ఒక మహిళ వేరొక మహిళతో గొడవ పెట్టుకుని ఉండొచ్చు.

ఏది ఏమైనా ఫ్యామిలీ కోర్టులో లాయర్ల సమక్షంలో వీరు చెప్పులు పట్టుకొని దుర్భాషలాడుతూ ఒకరికొకరు తన్నుకోవడం అక్కడి వారి అందరినీ షాక్‌కి గురి చేసింది.కొందరు ఈ ఘటనను ఫన్నీగా భావించి తమ ఫోన్లలో రికార్డ్ చేశారు.వాటిని ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు ‘మనుషులకు కొంచెం కూడా పద్ధతి లేకుండా పోతోంది’ అంటూ విమర్శిస్తున్నారు.
ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.








