నాటో సభ్యత్వ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ( Ukraine President Zelensky ) రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.నాటో దేశాల్లో( NATO Countries ) ఉక్రెయిన్‌ను చేర్చుకుంటానని చెబితేనే తాను యుద్దాన్ని మొదలుపెట్టానంటూ లేఖలో పేర్కొన్నారు.
ఇప్పుడు సభ్యత్వం ఇవ్వకుండా తమను వదిలిపెట్టడం సమంజసం కాదని చెప్పారు.రేపు మీకు కూడా ఇలాంటి పరిస్థితి రావొచ్చని, పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేమని భావోద్వేగానికి గురయ్యారు.
రేపు మీకు కూడా ఇలాంటి పరిస్థితి రావొచ్చు కదా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

జెలెన్ స్కీ రాసిన లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది.ఈ లేఖ నాటో సభ్యత్వ దేశాల్లో చీలికను తెచ్చినట్లు తెలుస్తోంది.నాటో సభ్యత్వ దేశాల్లోని 11 దేశాలు ఉక్రెయిన్‌గా ( Ukraine ) వ్యతిరేకంగా ఉండగా.
మిగతా దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉంటున్నాయి.అయితే ఉక్రెయిన్‌ను 11 నాటో సభ్యత్వ దేశాలు వ్యతిరేకించడానికి ఒక కారణం కూడా వినిపిస్తోంది.
నాటో సభ్యత్వంలో ఉన్న ఏ దేశమైనా సరే దాని అంతర్గత వ్యవహారాలు తప్ప దేశ భద్రత విషయంలో నాటోలో లేని ఏ దేశంతోనైనా సరిహద్దు వివాదం వస్తే నాటోలోని దేశాలన్ని కలిసి రంగంలోకి దిగాలి.

నాటో సభ్యత్వ దేశాలన్నింటి నుంచి సైనికులకు పంపాలి.ఇప్పటికే సెర్చియా దగ్గర జరుగుతున్న యుద్దంలో లక్ష సైన్యాన్ని మోహరించాల్సి వస్తుంది.దీని ప్రకారం ఉక్రెయిన్‌కి నాటో సభ్యత్వ దేశాలు షాక్ ఇస్తున్నాయి.ఇప్పటివరకు నాటోలో 31 దేశాలకు సభ్యత్వం ఉండగా.32వ దేశంగా స్వీడన్ ఉంది.నాటో సభ్యత్వం కలిగిన 20 దేశాలు ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకోవాలని, తాము ఆ దేశానికి అండగా ఉంటామని ఛైర్మన్ కి లేఖలు రాశాయి.ఛైర్మన్ స్టోలెన్ బర్గ్ రిటైర్ అవ్వనున్నారు.
ఆయన స్థానంలో ఎవరు వస్తారో ఇంకా తెలియడం లేదు.







