వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ( Youtube ) ఎంతగా పాపులర్ అయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.ప్రజలు చాలా ఏళ్లుగా వీడియోలను చూడటానికి దీనిపైనే ఆధారపడుతున్నారు.
సినిమాలు, గేమ్‌లు, ఎడ్యుకేషనల్ కంటెంట్, ఇతర విషయాలను ఇష్టపడే వ్యక్తులు అన్నిటికంటే ముందు యూట్యూబ్‌నే వాడుతున్నారు.అలా యూట్యూబ్ వీడియో కంటెంట్ స్పేస్‌లో నంబర్ 1గా నిలుస్తోంది.

అయితే ఇప్పుడు, టెస్లా కంపెనీ సీఈఓ, ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్( Elon Musk ) యూట్యూబ్ లాంటి ఒక వీడియో యాప్ తీసుకురావడానికి సిద్ధమయ్యారు.ట్విట్టర్( Twitter ) వీడియో లాంటి దానిపై ఆయన ట్విట్టర్ టీమ్ పని చేస్తోంది.ట్విట్టర్ అనేది వ్యక్తులు షార్ట్ మెసేజ్‌లు, ఫొటోలు పంచుకునే మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్.అయితే ట్విట్టర్ వీడియో అనేది యూట్యూబ్ లాగా పని చేయనుంది.ఇందులో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం కుదరుతుంది.ఇటీవల ట్విట్టర్ యూజర్ ఒకరు స్మార్ట్ టీవీలలో ట్విట్టర్ కోసం ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చి ఉంటే బాగుండేదని అన్నారు.
అప్పుడు యూజర్లు పెద్ద స్క్రీన్‌పై ట్విట్టర్ వీడియోలను చూడవచ్చని పేర్కొన్నారు.

అయితే ఎలాన్ మస్క్ ఆ వ్యక్తి ట్వీట్‌కి రిప్లై ఇస్తూ స్మార్ట్ టీవీల కోసం ట్విట్టర్ వీడియో యాప్ రాబోతోందని చెప్పారు.మస్క్ అలా చెప్పినప్పుడు, సదరు పేర్కొన్న యూజర్ సంతోషించారు.ఒకవేళ ట్విట్టర్ వీడియో యాప్ తీసుకొస్తే తాము యూట్యూబ్‌ని ఉపయోగించడం మానేస్తామని కూడా ఆ యూజర్ పేర్కొన్నాడు.
ఇటీవల, ట్విట్టర్ యూజర్లకు 2 గంటల నిడివి ఉన్న లాంగ్ వీడియోలను అప్‌లోడ్ చేయడానికి అనుమతించడం ప్రారంభించింది.కొందరు వ్యక్తులు ట్విట్టర్‌లో సినిమాలను అప్‌లోడ్ చేశారు, దీని వల్ల సినిమాలు లీక్ కావడం వంటి కొన్ని సమస్యలు వచ్చాయి.