ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.మూడు ప్రధాన పార్టీల నేతలు గెలుపుపై ఎవరికి వారు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్( BRS party ) మూడోసారి కూడా తమదే విజయం అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది.మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈసారి ఎలాగైనా బిఆర్‌ఎస్ ను గద్దె దించి తాము అధికారం చేపట్టాలని చూస్తున్నాయి.
దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపేవరిది అనే అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది.ఇదిలా ఉంచితే కర్నాటక ఎన్నికల్లో( Karnataka elections) విజయం తరువాత కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది.

అదే జోష్ ను తెలంగాణలో ( Telangana Congress )కూడా కొనసాగిస్తూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు.ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70-80 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు.ఇప్పుడు మరో సరికొత్త సర్వేను ఆయన తెరపైకి తెచ్చారు.
వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ 45 సీట్లు, కాంగ్రెస్ 45 సీట్లు, గెలుచుకుంటాయని, బీజేపీ 7, ఏంఐఏం 7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, మరో 15 స్థానాల్లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

ఓట్ల శాతంగా చూస్తే బిఆర్‌ఎస్ 37 శాతం, కాంగ్రెస్ 34 శాతం, బీజేపీ 14 శాతం, ఓట్లు నమోదు అయ్యే ఉందని ఆయన చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఆయన వెల్లడించిన సర్వేలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయనేది కొందరి అభిప్రాయం.రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా ఇవే ఫలితాలు ఎన్నికల్లో కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్యనే తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది.బీజేపీ ప్రభావం ఆ పార్టీ నేతలు చెబుతున్నంతగా ఉండకపోవచ్చనేది కొందరు చెబుతున్నా మాట.మరి రేవంత్ రెడ్డి సర్వే ఫలితాలు ఎంతవరకు నిజం అవుతాయో చూడాలి.







