మధుమేహం లేదా డయాబెటిస్ లేదా షుగర్ వ్యాధి.( Diabetes ) పేరు ఏదైనా రోగం ఒక్కటే.
ప్రతి ఏడాది షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఈ సమస్య కనిపించేది.
కానీ ప్రస్తుత రోజుల్లో ముప్పై ఏళ్ల వారు కూడా మధుమేహానికి గురవుతున్నారు.ఇకపోతే మధుమేహం వ్యాధి ఉన్నవారు ఏం తినాలన్నా భయపడుతుంటారు.
ఎక్కడ షుగర్ లెవల్స్ పెరుగుతాయో అని ఆందోళన చెందుతుంటారు.ఈ క్రమంలోనే తెలిసి తెలియక ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను కూడా దూరం పెడుతుంటారు.
![Telugu Cow Milk, Diabetes, Diabetic, Tips, Latest-Telugu Health Telugu Cow Milk, Diabetes, Diabetic, Tips, Latest-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2023/06/Amazing-Health-Benefits-of-Drinking-Cow-Milk.jpg)
ఈ జాబితాలో పాలు( Milk ) ఒకటి.నిజానికి మధుమేహం ఉన్నవారికి పాలు ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా రోజుకు ఒక గ్లాస్ ఆవు పాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మధుమేహం ఉన్నవారికి బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
అయితే రోజూ ఒక గ్లాస్ ఆవు పాలు తాగడం వల్ల శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడకుండా ఉంటుంది.దీంతో బోలు ఎముకల వ్యాధి వచ్చే రిస్క్ తగ్గుతుంది.
అలాగే మధుమేహం ఉన్నవారు బరువు బాగా పెరుగుతుంటారు.అయితే ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడానికి ఆవు పాలు సహాయపడతాయి.
ప్రతి రోజు ఆవు పాలు( Cow Milk ) తీసుకుంటే శరీర బరువు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఆకలి ఎక్కువగా ఉంటుంది.
అదే సమయంలో నీరసం, అలసట వంటివి కూడా అధికంగా ఇబ్బంది పెడతాయి.
![Telugu Cow Milk, Diabetes, Diabetic, Tips, Latest-Telugu Health Telugu Cow Milk, Diabetes, Diabetic, Tips, Latest-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2023/02/Healthy-Cashew-Dates-Milk-for-Weight-loss.jpg)
అయితే రోజు ఆవు పాలు తాగితే శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లభిస్తుంది.దాంతో అతి ఆకలి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
అంతేకాదు రోజు ఆవు పాలు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
సీజనల్ వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.ఒత్తిడి( Stress ), డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పరార్ అవుతాయి.
దంతాలు సైతం దృఢంగా మారతాయి.