ప్రభాస్ ( Prabhas )పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఆది పురుష్( Adipurush ).రామాయణ( Ramayanam ) ఇతిహాసం ఆధారంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఏమాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయిందని,ఈ సినిమా కార్టూన్ ఛానల్ కన్నా చాలా ఘోరంగా ఉంది అంటూ ఈ సినిమాపై నెగటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇలా సినిమా గురించి పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లు చేయడం వల్ల మొదటికే మోసం వస్తుందని భావించిన నిర్మాతలు మరో మార్గంలో ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆది పురుష నిర్మాతలపై పలువురు సోషల్ మీడియా వేదికగా సంచలనమైన పోస్టులు చేశారు.డాక్టర్ నిమో యాదవ్( Dr.Nimo Yadav ) అనే వ్యక్తి ట్విట్టర్ లో చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.అతడికి ట్విట్టర్ లో 50 వేలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.ఆదిపురుష్ చిత్రంపై నెగిటివ్ ట్వీట్స్ డిలీట్ చేసి పాజిటివ్ ట్వీట్స్ కనుక చేస్తే తనకు అమౌంట్ ఇస్తామంటూ అపరిచిత వ్యక్తుల నుంచి తనకు మెసేజ్ వచ్చిన ట్వీట్ ను ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇలా చేయడం వల్ల తనకు ఏకంగా 9500 పంపిస్తామని చెప్పినట్టు ఇందులో తెలియచేశారు.

మరో ట్విట్టర్ యూజర్ కి కూడా ఈ డీల్ వెళ్ళింది.రోషన్ రాయి అనే యూజర్ కి ట్విట్టర్ లో 11 వేలమంది ఫాలోవర్స్ ఉన్నారు.టి సిరీస్ సంస్థకి చెందిన కొందరు నాకు ఆదిపురుష్ పై నెగిటివ్ ట్వీట్ డిలీట్ చేసి పాజిటివ్ ట్వీట్ కనుక చేస్తే రూ.5500 ఇస్తామని ఆఫర్ చేశారు.కానీ వాళ్ళు రాంగ్ పర్సన్ ని ఎంచుకున్నారు అంటూ పోస్ట్ పెట్టాడు.
అంతేకాకుండా ఆయన వారికి రిప్లై ఇచ్చిన పోస్టులు కూడా షేర్ చేశారు.ఐదువేలు కాదు కదా ఐదు లక్షలు ఇస్తామన్న తాను ట్వీట్ డిలీట్ చేయనని ఆది పురుష్ సినిమా డిజాస్టర్ అంటూ చేసినటువంటి ట్వీట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







