ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి పనికి అత్యవసరంగా మారింది.సిమ్ కార్డు తీసుకోవడం నుంచి బ్యాంకు ఖాతా ఓపెన్ చేసే వరకు అన్ని అధికారిక పనులకు ఆధార్ సమర్పించడం అనేది తప్పనిసరి.
అయితే ఇలాంటి ఆధార్ కార్డులో ఒక అసభ్యకరమైన పదమున్న ఫొటో ఉంటే ఎంత ఇబ్బంది ఎదురవుతుందో ఊహించుకోవచ్చు.అలాంటి ఇబ్బందిని అంజీ ఉచిహా ( Anjie Uchiha)అనే యువతి ఎదుర్కొంటోంది.
ఫేస్‌బుక్‌లో ఈ సంఘటనను తాజాగా ఆమె షేర్ కూడా చేసింది.

ఆమె ఆధార్ కార్డు పొందేటప్పుడు ప్రమాదవశాత్తూ అసభ్యకరమైన సందేశంతో కూడిన టీ-షర్టును ధరించింది.ఆమె చొక్కాపై ఉన్న సందేశం అధికారిక చిత్రాలకు తగినది కాదు.ఆ మెసేజ్‌తో కూడిన చొక్కా ధరించి ఉన్నట్లు చూపిస్తూ తన ఆధార్ కార్డు ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
తన పోస్ట్‌లో ఈ పిక్ చూసి తను బాగా నవ్వుకుంటున్నానని చెప్పింది.చాలా కాలం పాటు తన ఐడీ కార్డ్ ఆ ఫొటోతో అలాగే ఉండిపోయిందని చమత్కరించింది.
ఇంతకీ రాసి ఉన్న ఆ పదం ఏంటంటే ఎఫ్.ఆఫ్ (F.Ff).సభ్యత లేకుండా ‘వెళ్లిపోండి’ అని దీని అర్థం.

నెటిజన్లు ఆమె పోస్ట్‌ను చూసి అయ్యో పాపం అని అంటూనే నవ్వుకుంటున్నారు.రేపొద్దున కాలేజీలో లేదా ఆఫీసులో లేదా ఇంకెక్కడైనా ఆధార్ కార్డు సమర్పించాలంటే ఎలా మరి అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.ఏది ఏమైనా ఇలాంటి అసభ్యకరమైన పదబంధాలు ఉన్న ఫోటోలను అంగీకరించకుండా ఉండాల్సింది.ఫోటో తీసుకునేటప్పుడు లేదా దింపేటప్పుడైనా గ్రహించి ఉండాల్సింది.అలాగే ఒక అమ్మాయి అయి ఉండి అభ్యంతరకరమైన పదాలు గల టీ షర్ట్‌లు వేసుకోవడం ఏంటని కొందరు నెటిజన్లు ఆమెకు చివాట్లు పెడుతున్నారు.







