ఒక తండ్రి నిర్లక్ష్యంతో ఇద్దరు పిల్లలు దుర్మరణం.. షాకింగ్ వీడియో వైరల్

ఇటీవల రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ ప్రమాదాల్లో తమ కుటుంబసభ్యులను కోల్పోతున్నారు.

 Two Children Died Due To Negligence Of A Father.. Shocking Video Viral , Two Ch-TeluguStop.com

ఒక్కొక్కసారి అనుకోకుండా ప్రమాదవశాత్తూ ప్రమాదాలు జరిగినా.ఎక్కువసార్లు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి.

తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్( Sajjanar )ఈ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు.ఈ వీడియోలో ఒక వ్యక్తి తన భార్య, పిల్లలను ఎక్కించుకుని బైక్ పై వెళుతున్నాడు.మలుపు దగ్గర చూసుకోకుండా అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు బస్సు కింద పడి దుర్మరణం పాలయ్యారు.ఇక తల్లిదండ్రులు ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ లో సజ్జనార్ షేర్ చేశారు.ఈ సందర్బంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఈ బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఖరీదు రెండు నిండు ప్రాణాలు.ఇద్దరు కుమారులు, భార్యను ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ బైక్ ను టీఎస్ఆర్టీసీ బస్సు(TSRTC bus )కు ఢీకొట్టాడు.ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా.తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు.నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్( Traffic rules ) పై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ తరహా ప్రమాదాలకు కారణం.రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు నిత్యం జాగ్రత్తగా ఉండాలి.

ట్రాఫిక్‌ రూల్స్‌ను విధిగా పాటించాలి.ఇలా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి’ అని ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube