సౌత్ ఈస్ట్ లండన్‌లోని పెక్‌హామ్‌లో దారుణం చోటు చేసుకుంది.మలయాళీ స్నేహితుల మధ్య జరిగిన విషాద సంఘటన అరవింద్ శశికుమార్( Arvind Sasikumar ) అనే వ్యక్తి మరణానికి దారితీసింది.
కొచ్చిలోని పనంపల్లి నగర్‌కు చెందిన 37 ఏళ్ల అరవింద్ కోల్‌మన్ రోడ్ జంక్షన్( Coleman Road Junction ) సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుండేవాడు.తనతో పాటు 20 ఏళ్ల స్నేహితుడు కూడా అక్కడే నివసిస్తున్నాడు.
అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఇటీవల వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ అపార్ట్‌మెంట్‌లో అరవింద్, అతని మలయాళీ స్నేహితుడు, మరో ఇద్దరు సహా నలుగురు వ్యక్తులు ఉంటున్నారు.అయితే గురువారం అర్థరాత్రి అరవింద్, అతని స్నేహితుడి మధ్య ఏర్పడిన విభేదాలు హింసాత్మకంగా మారాయి.చివరికి సదరు మలయాళీ స్నేహితుడు( malayali friend ) అరవింద్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
ఈ దృశ్యాలు చూసి ఇతర ఫ్లాట్‌మేట్స్ షాకయ్యారు.సహాయం కోసం వెంటనే పోలీసులను సంప్రదించారు.

అత్యవసర వైద్య సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అరవింద్‌కు సహాయం చేశారు.వారు ఎంత ప్రయత్నించినప్పటికీ, అరవింద్ గాయాలను తట్టుకోలేక సంఘటనా స్థలంలోనే మరణించాడు.ఈ విషాదకర పరిణామానికి దారితీసిన వాదనకు సంబంధించిన కచ్చితమైన కారణాన్ని పోలీసులు వెల్లడించలేదు.అపార్ట్‌మెంట్‌లో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్టూడెంట్ వీసాపై వచ్చిన అరవింద్ గత పదేళ్లుగా లండన్‌లో ఉంటున్నాడు.అతని జీవితం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందని అనుకోని తల్లిదండ్రులు ఇప్పుడు కన్నీరు మున్నీరు అవుతున్నారు.







