ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ప్రకంపనలు రేపుతున్న యాత్ర ఏదైనా ఉందా అంటే అది పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ‘వారాహి విజయ యాత్ర( Varahi )’ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.కేవలం మూడు రోజుల క్రితమే ఈ యాత్ర ప్రారంభం అయ్యింది, ఈ మూడు రోజుల్లో వారాహి యాత్ర సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు.
అధికార పార్టీ నాయకులూ అయితే వణికిపోతున్నారు.వైసీపీ పార్టీ చేసిన తప్పులను అధ్యయనం చేసి ఒక్కొక్కటిగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని కడిగి పారేసే తీరుని జనాలు కూడా గమనిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రసంగాలను కూడా వాళ్ళు ఎంతగానో ఇష్టపడుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన దీని గురించే చర్చ నడుస్తుంది.
అయితే వారాహి యాత్ర ఇంత అద్భుతంగా జరిగేందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి అని లేటెస్ట్ గా ఒక వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రతీ రాజకీయ పార్టీ కి ఒక స్ట్రాటజిస్ట్, ఒక అనలిస్ట్ మరియు ఒక సలహాదారుడు ఉంటాడు.కానీ జనసేన పార్టీ కి అవేమి లేదు,సరైన టీం లేకపోవడం వల్లే గత ఎన్నికలలో ఘోరమైన ఓటమిని చూడాల్సి వచ్చిందని అభిమానుల్లో మరియు జనసేన పార్టీ నాయకుల అభిప్రాయం.ఇదే విషయం పై మెగాస్టార్ చిరంజీవి అనేక సందర్భాలలో సలహా ఇచ్చాడట.
ఇప్పుడు అత్యద్భుతమైన టీం ని ఆయనే రికమెండ్ చేసాడట.వాళ్ళు ఇచ్చే సలహాలను ఫాలో అవ్వడం వల్లే పవన్ కళ్యాణ్ కి పొలిటికల్ గా మైలేజి ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు , అంతే కాదు రీసెంట్ గా చిరంజీవి( Chiranjeevi ) ని మాజీ మంత్రి నారాయణ మరియు టీడీపీ మాజీ ఎమ్యెల్యే గంట శ్రీనివాస రావు( Ganta Srinivasa Rao ) వెళ్లి చిరంజీవిని కలిసిన సంఘటన అందరినీ షాక్ కి గురి చేసింది .రాజకీయాలకు అసలు ఏమాత్రం సంబంధం లేని చిరంజీవిని ఈ ఇద్దరు ఎందుకు కలిశారు?, కచ్చితంగా ఎదో దాగిఉంది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపించాయి.

అయితే ఇలా చిరంజీవి సీనియర్ నాయకులందరినీ పోగు చేసి జనసేన పార్టీ లో చేర్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.తన తమ్ముడు ఈసారి ఎలా అయినా విజయం సాధించాలనే ఉద్దేశ్యం తోనే చిరంజీవి ఇదంతా చెయ్యిస్తున్నదని, తెర బయటే జనసేన గెలవడానికి కావాల్సిన అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాడని తెలుస్తుంది.గతం లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఎండా, వాన అనేది లెక్క చెయ్యకుండా అహర్నిశలు పార్టీ గెలుపుకోసం కష్టపడ్డాడు.
చిరంజీవి ఆ స్థాయిలో జనసేన పార్టీ కి సేవలు చెయ్యడం లేదు కానీ, వెనుక నుండి మాత్రం ఆయన మోరల్ సపోర్టు మామూలుగా లేదని అంటున్నారు.ఈమధ్యనే ప్రారంభమైన ఈ ‘వారాహి విజయ యాత్ర’ ఇప్పుడు కాకినాడ కి చేరింది, నేడు కాకినాడ లో పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రసంగం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.








