Tollywood Movies: హీరోయిన్లకు భర్తగా నటించిన హీరోలే అన్నగా నటించారు.. ఇదెక్కడి విడ్డూరంరా బాబు?

ఒక సినిమాలో భార్యాభర్తలుగా నటించిన నటీనటులు మరో సినిమాలలో అన్న చెల్లెలు గా కూడా నటిస్తూ ఉంటారు.ఇలా నటించటానికి వాళ్లకు ఏమీ అనిపించదు కానీ.

 Heroines Who Acted As Wives And As Sisters To The Same Hero Chiranjeevi Nayanth-TeluguStop.com

కానీ చూసే ప్రేక్షకులకు మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.అంటే భార్య భర్తలు గా ఉన్న పాత్రలలో వాళ్లు రొమాంటిక్ సీన్లలో కూడా నటిస్తూ ఉంటారు.

అసలు చూడటానికి రియల్ కపుల్స్ బాగా కనిపిస్తూ ఉంటారు.

అటువంటిది వేరే సినిమాలలో అన్న చెల్లెలుగా చేయాలి అంటే సులువుగా చేసేస్తారు.

అంతేకాదు ఒక హీరోయిన్ ఒక సీనియర్ హీరోతో హీరోయిన్గా చేసి.అదే సీనియర్ హీరో కొడుకుకు కూడా హీరోయిన్ గా చేస్తూ ఉంటారు.

అంటే తండ్రి, కొడుకులకు ఒకటే హీరోయిన్ అన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు.తెలుగు సినిమాలలో ఇటువంటి పాత్రలలో నటించిన వాళ్లలో చాలామంది ఉన్నారని చెప్పాలి.

కానీ ప్రేక్షకులు ఎందుకో వాళ్లను రీల్ భార్యాభర్తలు గానే చూడాలి అని అనుకుంటారు.కొన్ని కొన్ని సార్లు వాళ్లను అన్న చెల్లెలుగా చూపించడం వల్ల కూడా సినిమాలు ప్లాప్ అయినా సందర్భాలు ఉన్నాయని చెప్పాలి.

ఒక సినిమాలో భార్యాభర్తలుగా చేసి మరో సినిమాలలో అన్న చెల్లెలుగా ఎలా నటిస్తారు రా బాబు ఇది చాలా విడ్డూరం అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పవచ్చు.ఇట్లా భార్యాభర్తలుగా చేసిన వాళ్ళు అన్నాచెల్లెలుగా కనిపించిన సినిమాలలో కొంతవరకు ఫ్లాప్ అయినవి కూడా ఉన్నాయి.

ఇంతకు అలా చేసిన హీరో హీరోయిన్లు ఎవరు.వాళ్ళు చేసిన సినిమాలు ఏంటో.అందులో ఏవి సక్సెస్ అయ్యాయో లేవో చూద్దాం.

చిరంజీవి – నయనతార:

సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరు,( Chiranjeevi ) నయనతార ( Nayanthara ) భార్యాభర్తలుగా కనిపించారు.కానీ గాడ్ ఫాదర్ సినిమాలో వీరిద్దరూ అన్నా చెల్లెలుగా కనిపించడంతో జనాలు బాగా ట్రోల్స్ చేశారు.పైగా సినిమా కూడా అంత.సక్సెస్ కాలేదు.

Telugu Chiranjeevi, God, Jayasudha, Krishna, Nayanthara, Nazar, Ntr Savitri, Pra

రమ్యకృష్ణ – నాజర్:

రమ్యకృష్ణ,( Ramyakrishna ) నాజర్ ( Nasser ) గతంలో రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలో అన్నా చెల్లెలుగా నటించగా బాహుబలి సినిమాలో భార్యాభర్తలుగా నటించారు.కానీ వీరి మధ్య అటువంటి ట్రోల్స్ మాత్రం రాలేదు.

Telugu Chiranjeevi, God, Jayasudha, Krishna, Nayanthara, Nazar, Ntr Savitri, Pra

ఎన్టీఆర్ – సావిత్రి:

ఎన్నో సినిమాలలో హీరో హీరోయిన్ గా నటించిన వీరిద్దరూ రక్తసంబంధం సినిమాలో అన్నా చెల్లెలుగా నటించారు.అప్పటి ప్రేక్షకులు వీరిద్దరూ అన్న చెల్లెలుగా కనిపించడంతో ప్రేక్షకులు అంత తొందరగా కనెక్ట్ అవ్వలేదు.

Telugu Chiranjeevi, God, Jayasudha, Krishna, Nayanthara, Nazar, Ntr Savitri, Pra

ప్రకాష్ రాజ్ – జయసుధ:

ఎన్నో సినిమాలలో భార్య భర్తలుగా చేసిన ప్రకాష్ రాజ్, జయసుధ.సోలో సినిమాలో అక్కతమ్ముడిగా నటించారు.దీంతో ప్రేక్షకులు వీళ్ళను ఇలా చూడటానికి ఇష్టపడలేదు.

ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు.

Telugu Chiranjeevi, God, Jayasudha, Krishna, Nayanthara, Nazar, Ntr Savitri, Pra

కృష్ణ – సౌందర్య:

ఎన్నో సినిమాలలో హీరో హీరోయిన్ గా నటించిన కృష్ణ, సౌందర్య రవన్న సినిమాలో అన్న చెల్లెలి పాత్రలో కనిపించారు.ఇక వీరిద్దరిని కూడా చాలామంది కపుల్ గా చూడాలనుకున్నారు కానీ అన్న చెల్లెలుగా చూడలేకపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube