అద్భుతం.విశేషమైన స్పందన తెచ్చుకున్న ఆదిపురుష్( Adipurush ) మొదటి రోజు యునామినస్ కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) నటించిన పాన్ ఇండియన్ సినిమా ఆదిపురుష్ నిన్న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రికార్డ్ స్థాయి థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.రామాయణం ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా రిలీజ్ అయ్యి మిశ్రమ టాక్ తెచ్చుకుంది.
ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఫలితంగా నిన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది.
స్టార్ హీరో లంకేశ్వరుడు రావణాసురుడిగా నటించగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Om Raut ) తెరకెక్కించాడు.జూన్ 16న వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డెయ్ ఎంత రాబట్టింది అనేది మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

ఈ కలెక్షన్స్ విన్న వారంతా నోరెళ్ల బెడుతున్నారు.భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా 140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను దక్కించు కున్నట్టు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.అలాగే తమ సినిమాకు ఇంత ఆదరణ అందిస్తున్న ఫ్యాన్స్ కు టీమ్ స్పెషల్ థాంక్స్ చెబుతూ పోస్టర్ ద్వారా కలెక్షన్స్ ను రిలీజ్ చేసింది.

ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవ్వడంతో 100 కోట్ల వరకు మొదటి రోజు కలెక్ట్ చేస్తుంది అని అనుకున్న వారికీ ఈ సినిమా 140 కోట్ల కలెక్షన్స్ రాబట్టి పెద్ద షాక్ ఇచ్చింది.మరి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.ప్రభాస్ నటించిన ఈ సినిమాను మెగా బడ్జెట్ తో భూషణ్ కుమార్ , క్రిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, ఓం రౌత్, వంశీ, ప్రమోద్, రాజేష్ నాయర్ లు టి సిరీస్ సంస్థ, రిట్రో సంస్థపై గ్రాండ్ గా నిర్మించారు.