ఆదిపురుష్ సినిమాలో( Adipurush ) ఓం రౌత్( Director Om Raut ) చేసిన తప్పుల గురించి సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాపై ఈ స్థాయిలో నెగిటివిటీ వస్తుందని ఎవరూ ఊహించాలేదు.
ప్రభాస్( Prabhas ) పాత్ర లుక్స్ విషయంలో కూడా నెగిటివ్ కామెంట్లు రావడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.అయితే రాముడి పాత్రను ఎలా చూపించాలో రాజమౌళిని ( Rajamouli ) చూసి నేర్చుకోవాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రాజమౌళి మాట్లాడుతూ బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి పాత్రను రాముని స్పూర్తితో తీర్చిదిద్దానని తెలిపారు.బాహుబలి సినిమాకు సంబంధించి నాన్న మొదట శివగామి క్యారెక్టర్ చెప్పారని, ఆ తర్వాత కట్టప్ప క్యారెక్టర్ చెప్పారని, ఆ తర్వాత భళ్లాలదేవుడు రోల్ గురించి చెప్పారని అన్నారు.
అన్ని పాత్రలు క్రియేట్ అయిన తర్వాత చివర్లో ఫామ్ అయిన క్యారెక్టర్ బాహుబలి అని ఆయన చెప్పుకొచ్చారు.

ఛత్రపతి సినిమాతో ప్రభాస్ కు నాకు మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని రాజమౌళి పేర్కొన్నారు.రాముడు, కృష్ణుడు దేవుళ్లు అని రెగ్యులర్ కమర్షియల్ హీరోలకు ఉండాల్సిన లక్షణాలు కృష్ణునికి ఉన్నాయని అన్నారు.రాముడిది సాఫ్ట్ క్యారెక్టర్ కాబట్టి బాహుబలి రోల్ ను అలా క్రియేట్ చేశామని మిగతా రోల్స్ ను మాత్రం బలంగా మాస్ గా చూపించడం జరిగిందని రాజమౌళి అన్నారు.

బాహుబలి సినిమాలో హీరో పాత్ర చనిపోతే కంటతడి పెట్టని ప్రేక్షకుడు ఉండడని ఆయన అన్నారు.రాజమౌళిని చూసి ఓం రౌత్ ఆదిపురుష్ ను తెరకెక్కించి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాజమౌళి రామాయణం తెరకెక్కిస్తే బాగుంటుందని భావి తరాల ప్రేక్షకులకు నచ్చేలా జక్కన్న మాత్రమే తెరకెక్కించగలడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహాభారతంపై దృష్టి పెట్టిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి రామాయణంపై కూడా దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది.







