ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Astrologer Venu Swamy ) గురించి మనందరికీ తెలిసిందే.తరచూ సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలకు సంబంధించిన జీవితాల గురించి వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు.
గతంలో నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న సమయంలో వారు ముందే విడిపోతారని ముందే చెప్పాను అంటూ సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి రకరకాల కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా ఆది పురుష్ సినిమా అంతంత మాత్రంగానే ఉంటుంది అంటూ విడుదలకు ముందే చెప్పిన విషయం తెలిసిందే.

ప్రభాస్ జాతకం( Prabhas Astrology )లో దోషం కారణంగా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం లేదని ఎలాంటి సంచలనాలు నమోదు చేయదని చెప్పాడు.సీన్ కట్ చేస్తే భారీ బడ్జెట్‌తో భారీ అంచనాలతో తాజాగా థియేటర్స్‌లో విడుదలైన ఆదిపురుష్ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది.ప్రభాస్ వరకూ పర్లేదు కానీ దర్శకుడు ఓం రౌత్( Director Om Raut ) ఇష్టం వచ్చినట్టు రామాయణాన్ని మార్చేశాడని చాలామంది డైరెక్టర్ ని తిట్టిపోతున్నారు.
కాగా ఈ సినిమా విడుదలకు ముందు రిజల్ట్ చెప్పిన వేణు స్వామి తాను చెప్పినట్లే జరగడంతో మరోసారి ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్ కెరియర్( Prabhas Career ) అయిపోయిందని, ఆయన జాతకంలో దోషం ఉందని తెలిపారు వేణు స్వామి.తాజగా ఒక ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ.నేను చాలామంది జాతకాలు చూశాను కానీ.
ప్రభాస్ జాతకం చాలా విచిత్రమైన జాతకం.టాలీవుడ్‌లోనే ఇలాంటి విచిత్రమైన జాతకాలు ఇద్దరే ఇద్దరికి ఉన్నాయి.
ఒకటి ప్రభాస్, రెండు రాజమౌళి.ప్రభాస్‌ది తులారాశి.
ఆయన జీవితంలో హైట్స్ అన్నీ అయిపోయాయి.ఇక ముందు అన్నీ డౌన్సే.
ప్రభాస్‌తో సినిమాలు చేసే ప్రొడ్యుసర్లు ఖచ్చితంగా జాతకాలు చూపించుకోవాల్సిందే.ఎందుకంటే ఆయన కెరియర్ కష్టం.
ఆయన మళ్లీ చిన్న సినిమాలు చేసి కెరియర్‌ని గాడిలో పెట్టుకోవాలి తప్ప వేరే మార్గం లేదు.ప్రభాస్ జాతకంలో ఆయన గ్రాఫ్ పైకి వెళ్లి కిందికి పడిపోయింది.
ఇంచుమించు రాజమౌళి జాతకం కూడా అంతే.

కానీ రాజమౌళి( Director Rajamouli )కి ఇంకా టైం ఉంది.కానీ ప్రభాస్‌కి టైం లేదు.సెంటిమెంట్లు ఎక్కువ ఉండేది సినిమాలు, పాలిటిక్స్ లోనే.
కానీ ప్రభాస్ జాతకాలను నమ్ముడు.ఒక్క ప్రభాస్ తప్ప మిగిలిన వాళ్లంతా జాతకాలను నమ్ముతారు.
ఆయనది తులా రాశి ఎంత ఎత్తుకి ఎదిగాడో కిందికి పడతాడు.ఇక ఆయన గ్రాఫ్ దిగడం తప్ప ఎక్కడం ఉండదు.
పైగా ప్రభాస్ జాతకరీత్యా ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి.ఈ 2023 సంవత్సరం ఆయనకి అత్యంత దారుణంగా ఉండబోతోంది.
దాన్ని ఎదుర్కోవడానికి ప్రభాస్ సిద్ధమవ్వాలి అంటూ సంచలన వవాఖ్యలు చేశారు వేణు స్వామి.







