ఇంటింటి సర్వే ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలి కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag jayanthi ) రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నద్దత కార్యక్రమాలను పకడ్బందీగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి ఎన్నికల సన్నద్దత పై జిల్లా కలెక్టర్ , ఆర్డీఓ లు టి శ్రీనివాసరావు ( T Srinivasa Rao )పవన్ కుమార్ లతో అన్ని మండలాల తహశీల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నద్ధత కార్యక్రమాలను పకడ్బందీగా పూర్తి చేయాలని, ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తహసీల్దార్లను ఆదేశించారు.మన రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు భారత ఎన్నికల కమిషన్ జూన్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుందని, దీనికోసం సంపూర్ణ సమాచారంతో సిద్ధం కావాలని అన్నారు.
ఇంటింటా సర్వే ప్రక్రియ ను సకాలంలో పూర్తి చేయాలన్నారు.సంబంధిత పురోగతి రిపోర్ట్ ను ప్రతిరోజు తనకు నివేదించాలన్నారు.
ఓటరు జాబితాలో డిలీషన్ లకు సంబంధించి ఫైల్ ను సిద్దం చేయాలన్నారు.స్టాండర్డ్ ఆపరేట్ ప్రొసీజర్ మెయింటైన్ చేయాలన్నారు.