ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. భారత మ్యాచ్లకు ప్రత్యేక వేదిక..!

పాకిస్తాన్ ఆసియా కప్ కు( Asia Cup ) ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎన్నో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.భారత్ ఆసియా కప్ కోసం పాకిస్తాన్ కు( Pakistan ) వెళ్ళేది లేదని తెగేసి చెప్పిన తర్వాత ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఎన్ని చర్చలు జరిపిందో అందరికీ తెలిసిందే.

 Asia Cup 2023 Dates Announced Check Full Schedule Teams Date Venue Details, Asia-TeluguStop.com

చివరికి భారత్ కు( India ) ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించి, ఆ తర్వాత భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీ విషయంలో మెలిక పెట్టిన విషయం తెలిసిందే.

Telugu Asiacricket, Asia Cup, Asia Cup Teams, Bcci, Cricket, India, Pakistan, Sr

కానీ బీసీసీఐ ముందు పాకిస్తాన్ ఎత్తుగడలు సాగలేదు.చివరికి ఆసియా కప్ టోర్నీ పాకిస్తాన్ చేతిలోంచి జారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.ఆసియా క్రికెట్ కౌన్సిల్( ACC ) పలుమార్లు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించి చివరికి షెడ్యూల్ విడుదల చేసింది.

ఇక ఆసియా కప్ కు పాకిస్తాన్ తో పాటు శ్రీలంక కూడా ఆతిథ్యం ఇవ్వనుంది.ఈ టోర్నీ ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17 వరకు జరుగనుంది.

ఈ టోర్నీలో భాగంగా పాకిస్తాన్లో నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి.ఇక ఫైనల్ మ్యాచ్ తో కలిపి మిగిలిన మ్యాచ్లన్ని శ్రీలంకలో జరుగనున్నాయి.

ఈ టోర్నీలో మొత్తం 13 వన్డే మ్యాచులు జరుగుతాయి.

Telugu Asiacricket, Asia Cup, Asia Cup Teams, Bcci, Cricket, India, Pakistan, Sr

ఈ ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో పాటు కొత్తగా నేపాల్ జట్టు కూడా బరిలోకి దిగనుంది.ఈ టోర్నీలో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.ఒక గ్రూపులో భారత్, పాకిస్తాన్, నేపాల్ జట్లు ఉండగా.

మరొక గ్రూపులో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉంటాయి.ఈ రెండు గ్రూపులలో టాప్-2 లో నిలిచిన జట్లు సూపర్-4 కు చేరుతాయి.సూపర్-4 దశలో ఈ నాలుగు జట్లలో టాప్ -2 లో నిలిచే జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి.ఇక భారత్ ఆడే మ్యాచ్ లన్ని శ్రీలంక వేదికపైనే నిర్వహిస్తారు.

అంతేకాదు ఫైనల్ మ్యాచ్ కూడా శ్రీలంక వేదిక గానే జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube