ఇతిహాస గ్రంధం రామాయణం( Ramayanam ) ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా ”ఆదిపురుష్”. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు రిలీజ్ అయ్యింది.
దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్( Kriti Sanon ) సీత పాత్రలో నటించింది.బాలీవుడ్ స్టార్ హీరో లంకేశ్వరుడు రావణాసురుడిగా నటించగా ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Director Om Raut ) తెరకెక్కించిన ఈ మాసివ్ ప్రాజెక్ట్ జూన్ 16న అంటే ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాపై భారీ హోప్స్ నెలకొన్నాయి.ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ముందు నుండి మాసివ్ బుకింగ్స్ నెలకొల్పుకుంది.బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే కొద్దిసేపటికే సర్వర్ క్రాష్ అయ్యిందంటే ఆదిపురుష్ హవా అర్ధం చేసుకోవాలి.
ఈ ఏడాది బిగ్గెస్ట్ రిలీజ్ లలో ఒకటిగా ఉన్న ఆదిపురుష్( Adipurush ) మొదటి రోజు ఎంత రాబడుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.పీవీఆర్ సంస్థ ఏకంగా లక్ష టికెట్స్ అమ్మడంతో ఆదిపురుష్ డే 1 వసూళ్ల( Adipurush First Day Collections )పై మరింత ఆసక్తి నెలకొంది.
ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.

మరి ఇదే జరిగితే ఆదిపురుష్ తో ప్రభాస్( Prabhas ) బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసినట్టే.ప్రాంతాలవారీగా అనుకుంటే ఈ సినిమాకు తొలిరోజు హిందీలో 30 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంచనా.సౌత్ మొత్తం కలిసి 80 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తుందని ట్రేడ్ అంచనాలు వేస్తుంది.
ఓవరాల్ గా చూసుకుంటే ఆదిపురుష్ మొదటి రోజు మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.







