హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫుడ్స్ మీ డైట్ లో ఉండాల్సిందే!

అధిక బరువు.ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందికి ఇది అతి పెద్ద శత్రువు.

 Best Foods For Gaining Weight Healthily! Best Foods, Weight Gain, Weight Gain, H-TeluguStop.com

అయితే బరువు తగ్గడమే కష్టమని భావిస్తుంటారు.కానీ బరువు పెరగడం కూడా కొందరికి కష్టంగా ఉంటుంది.

సాధారణంగా కొందరు చాలా బక్కగా చీపురు పుల్ల మాదిరి ఉంటారు.తమ ఏజ్ కి సరిపడా వెయిట్ ఉండరు.

ఇలాంటి వారు బరువు పెరగడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.కానీ, బరువు పెరగడానికి ఏది పడితే అది తినేస్తే ఆరోగ్యం పాడవుతుంది.

హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలి.అందుకు ఇప్పుడు చెప్పబోయే ఫుడ్స్ అద్భుతంగా సహాయపడతాయి.

మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

గుడ్లు బరువు పెరగడానికి అద్భుతంగా సహాయపడతాయి.

తక్కువ బరువు ఉన్నవారు రోజుకు రెండు ఉడికించిన గుడ్లు( boiled eggs ) తింటే హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతార‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పీనట్ బటర్ ( Peanut butter )బరువు పెరగడానికి హెల్ప్ చేస్తుంది.

రోజుకు వన్ టేబుల్ స్పూన్ చొప్పున పీనట్ బటర్ ను తీసుకుంటే క్యాలరీలు పెరుగుతాయి.దాంతో బరువు పెరుగుతారు.

Telugu Foods, Tips, Healthy, Latest-Telugu Health

అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలని భావిస్తున్న వారు రోజుకు ఒక అవకాడో పండును తీసుకోండి.మ‌రియు ఒక గ్లాస్ కొబ్బరిపాలను ( coconut milk )తీసుకోండి.ఇవి బరువు పెరగడానికి చాలా బాగా తోడ్పడతాయి.అరటి పండ్లు ఏడాది పొడవునా లభిస్తాయి.అరటి పండ్లు( Bananas ) తక్కువ ధరకే లభించినా బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటాయి.అరటి పండ్లు బరువు పెరగడానికి కూడా ఎంతో బాగా సహాయపడతాయి.

బరువు పెరగాలని ప్ర‌య‌త్నిస్తున్నవారు రోజుకు ఒక అరటి పండును కచ్చితంగా తీసుకోండి.

Telugu Foods, Tips, Healthy, Latest-Telugu Health

బంగాళదుంప వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది.కాబట్టి బంగాళదుంప డైట్ లో ఉండేలా చూసుకోండి.ఇక వీటితో పాటు పన్నీర్, వైట్ రైస్, పాస్తా, ఎండు ద్రాక్ష, చేపలు, చికెన్, బీన్స్, ఖర్జూరం వంటివి కూడా బరువు పెరగడానికి సహాయపడుతాయి.

కాబట్టి ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలని భావిస్తున్నారో కచ్చితంగా తమ డైట్ లో ఇప్పుడు చెప్పుకున్న‌ ఆహారాలను చేర్చుకోండి.హెల్తీగా బరువు పెరగండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube