ప్రభాస్ ( Prabhas ) ఆదిపురుష్ సినిమా( Adipurush ) తెలుగు రాష్ట్రాల్లో మరియు ఉత్తర భారతంలో ని కొన్ని రాష్ట్రాల్లో భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ ను దక్కించుకున్నాయి.కానీ యూఎస్ లో( US ) మాత్రం సినిమా స్థాయి లో బుకింగ్ జరగలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
యూఎస్ లో ప్రభాస్ గత చిత్రాలు నిరాశ పర్చాయి.మరీ దారుణమైన వసూళ్లు అక్కడ నమోదు అయిన విషయం తెల్సిందే.
దాంతో ఆదిపురుష్ సినిమా ను కూడా అక్కడి వారు నమ్మే పరిస్థితి లేదు.ప్రభాస్ అభిమానులు మాత్రమే సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
వారు మాత్రమే బుకింగ్ చేశారు.

రెండున్నర మిలియన్ డాలర్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వస్తుందని భావిస్తే కనీసం అందులో సగం అయిన నమోదు అయిన పరిస్థితి లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఆదిపురుష్ సినిమా ను యూఎస్ లో పోస్ట్ రిలీజ్ బుకింగ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ లో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఆదిపురుష్ యొక్క అడ్వాన్స్ బుకింగ్ భారీగా లేనంత మాత్రాన అక్కడ భారీ వసూళ్లు సాధ్యం కాదు అనుకోవడం తప్పు అవుతుంది.
తప్పకుండా ఈ సినిమా ఓ రేంజ్ లో వసూళ్లు నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ముందు ముందు కూడా తప్పకుండా భారీ ఎత్తున ఈ సినిమా గురించి ప్రచారం జరుగుతుంది కనుక వసూళ్ల విషయంలో అంతకు మించి అన్నట్లుగా ఉండే అవకాశం ఉంది.వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని అంతా నమ్మకంగా ఉన్నారు.ఆ వెయ్యి కోట్లలో కనీసం 60 నుండి 80 కోట్లు అయినా యూఎస్ నుండి వస్తాయని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి కొన్ని గంటల్లో సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.







