గూగుల్ మ్యాప్స్ లో సరికొత్తగా మూడు ఫీచర్లు.. ఇకపై గమ్యం సులభంగా..!

గూగుల్ మ్యాప్స్( Google Maps ) అందుబాటులోకి వచ్చాక అడ్రస్ తెలియకపోయినా గమ్యానికి సురక్షితంగా చేరుతున్నారు.అదే గతంలో దారిన పోయే వారిని అడ్రస్ అడుగుతూ ఎన్నో ఇబ్బందులు పడి గమ్యానికి చేరేవారు.

 Google Maps Brings Three New Features For Travellers Details, Google Maps , Goog-TeluguStop.com

గూగుల్ మ్యాప్స్ ఎంతోమంది ప్రజల ఆదరణ పొందింది.తమ వినియోగదారుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని గూగుల్ మ్యాప్స్ సరికొత్తగా మూడు ఫీచర్లను రూపొందించడం జరిగింది.

ఈ ఫీచర్లతో ప్రయాణం మరింత సులభతరం అవ్వనుంది.ఆ ఫీచర్లు ఏమిటో చూద్దాం.

రీసెంట్స్ ఫీచర్ అప్డేట్:

ప్రస్తుతం వినియోగదారులు ఉపయోగిస్తున్న గూగుల్ మ్యాప్ ఫీచర్ ను అప్డేట్ చేశారు.అంటే గూగుల్ మ్యాప్ సహాయంతో వెళ్లిన అన్ని ప్రదేశాలను సేవ్( Save Locations ) చేస్తుంది.

ఈ ఫీచర్ గతంలోనే ఉంది.కానీ తాజాగా అప్డేట్ చేయడం ద్వారా గూగుల్ మ్యాప్స్ విండో క్లోజ్ చేసినా కూడా ఆ ప్రదేశాలు సేవ్ చేయబడతాయి.

అవసరం ఉంటే పర్వాలేదు.అవసరం లేకుంటే ఆ ప్లేసెస్ ను యూజర్లు డిలీట్ చేసుకోవచ్చు.

ఒకేసారి ఒకటికి మించిన టిప్స్ ను కూడా ప్లాన్ చేసుకోవచ్చు.ఈ ప్లేసెస్ ను షేర్ కూడా చేసుకోవచ్చు.

Telugu Glanceable, Google Maps, Immersive View, Save, Travellers-Technology Telu

గ్లాన్సబుల్ డైరెక్షన్:

గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చిన ఫీచర్ లలో ఇది చాలా కీలకమైనది.ఎందుకంటే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లాక్ పై, రూట్ ఓవర్ వ్యూ పై కూడా ట్రావెల్ ప్రోగ్రెస్( Travel Progress ) ను ఈ ఫీచర్ ద్వారా చక్కగా తెలుసుకోవచ్చు.కేవలం ఈ ఫీచర్ ని ఎనేబుల్ చేసుకొని గమ్యస్థానానికి చేరే వివిధ మార్గాలు చూపమని రిక్వెస్ట్ చేస్తే చాలు ట్రిప్ కు సంబంధించిన ప్రోగ్రెస్ను, మార్గంలో ముందు వచ్చే టర్నింగ్ ను, గమ్యస్థానానికి చేర్చే ఖచ్చితమైన సమయంను చూపిస్తుంది.ఈ ఫీచర్ ఎప్పటికప్పుడు వెంటనే ట్రిప్ వివరాలను అప్డేట్ చేస్తుంది.

గతంలో అయితే ఈ ఫీచర్ ఫుల్ నేవిగేషన్ మోడ్ లో ఉన్నప్పుడే అందుబాటులో ఉండేది.అలాకాకుండా ప్రస్తుతం లాక్ స్క్రీన్ పై, రూట్ ఓవర్ వ్యూపై కూడా అందుబాటులోకి వచ్చింది.

త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Telugu Glanceable, Google Maps, Immersive View, Save, Travellers-Technology Telu

ఇమెర్సివ్ వ్యూ:

ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 500 కు పైగా ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు, ల్యాండ్ మార్క్స్ కు ఈ ఇమెర్సివ్ వ్యూ ఫీచర్ అందుబాటులో ఉంది .ఈ ఫీచర్ పర్యాటక ప్రదేశం లేదా ల్యాండ్ మార్కు సంబంధించిన వేలాది ఫోటోలను కృత్రిమ మేథా సాంకేతికతతో కంబైన్ చేసి త్రీడీలో చూసేలా ఈ ఇమెర్సివ్ వ్యూ ఫీచర్ అవకాశం కల్పిస్తుంది.ఈ ఫీచర్లు గూగుల్ మ్యాప్స్ ద్వారా ట్రిప్ ప్లాన్ చేసేవారికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube