పాప్లర్ చెట్ల పెంపకంలో పెట్టుబడి తక్కువ.. ఆదాయం లక్షల్లో..!

వ్యవసాయ రంగంలో పెట్టుబడి తక్కువగా ఉండే, ఆదాయం ఎక్కువగా ఉండే పంటను పండించడానికి రైతులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.పైగా భారతదేశంలో( India ) 60 శాతానికి పైగా మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

 The Investment In Poplar Tree Cultivation Is Low The Income Is In Lakhs , Popla-TeluguStop.com

మార్కెట్లో అధిక డిమాండ్ ఉండే పంటలను పండిస్తేనే ఆదాయం అనేది లాభదాయకంగా ఉంటుంది.పాప్లర్ చెట్లకు( poplar trees ) ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.

ఎందుకంటే ఈ పాప్లర్ చెట్ల చెక్కతో కాగితం, చాప్ స్టిక్స్, చెక్క పెట్టెలు, అగ్గి పుల్లలు, లైట్ ప్లైవుడ్ లాంటివి తయారు చేస్తారు.ఒక్క భారతదేశంలోనే కాకుండా ఆసియా, అమెరికా, యూరప్ దేశాలలో కూడా ఈ చెట్లను అధిక సంఖ్యలో పెంచుతున్నారు.

ఈ చెట్లను పెంచే విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Telugu Agriculture, Latest Telugu, Plywood, Poplar Tree, Poplar Trees, Wooden Bo

ఈ పాప్లర్ చెట్లను కాటన్ వుడ్ ( Cotton Wood )అని కూడా పిలుస్తారు.వేసవికాలంలో ఈ చెట్లలో పెరుగుదల అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది.భూమి యొక్క పీహెచ్ విలువ 6 నుండి 8 మధ్యన ఉండాలి.

ఇక ఉష్ణోగ్రత ఐదు నుంచి 45 డిగ్రీల మధ్యలో ఉంటే ఈ చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయి.ఒక చెట్టు దాదాపుగా 80 అడుగులు పెరుగుతుంది.కాబట్టి చెట్ల మధ్య కనీసం 12 నుంచి 15 అడుగుల దూరం ఉండాలి.

Telugu Agriculture, Latest Telugu, Plywood, Poplar Tree, Poplar Trees, Wooden Bo

ఈ చెట్లు నాటిన ఐదు సంవత్సరాలకు కోతకు వస్తాయి.అంతేకాదు ఈ చెట్ల మధ్యలో అంతర పంటగా ఇతర పంటలను కూడా సాగు చేసుకోవచ్చు.ఈ చెట్ల మొక్కలు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎవరైనా ఈ మొక్కలను పెంచాలి అనుకుంటే ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.ఇక మార్కెట్లో ఒక చెట్టుకు దాదాపుగా నాలుగువేల ధర ఉంటుంది.ఒక హెక్టారులో ఈ చెట్లను పెంచడం వల్ల దాదాపుగా రూ.5 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.ఇక ఈ చెట్ల మధ్యన అంతర పంటగా టమోటా, బంగాళదుంప, కొత్తిమీర లాంటి పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube