ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్.ఈ సినిమా జూన్ 16న భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కాబోతున్నది.
ఒకరకంగా బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ప్రస్తుతం ఆదిపురుష్ మాటే వినిపిస్తొంది.ఈ మైథలాజికల్ విజువల్ వండర్ పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి .ఇక అన్ని భారతీయ భాషల్లో కలిపి రిలీజ్‌కు ఒక రోజు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా .ఇప్పటికే 100 కోట్లను క్రాస్ చేసి ఆదిపురుష్( Adipurush ) కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది.రామాయణ ఇతిహాసాన్ని మోషన్ క్యాప్చర్ త్రీడీ టెక్నాలజీతో ‘ఆదిపురుష్’ సినిమా రూపొందించారు.ఓం రౌత్ దర్శకత్వంలో టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇందులో శ్రీరామ చంద్రుడిగా ప్రభాస్.జానకీ దేవిగా కృతి సనన్( Kriti Sanon ) నటించారు.
అలాగే లంకేశ్వరుడు రావణుడుగా సైఫ్ అలీఖాన్ ( Saif Ali Khan )నటించారు.ఈ మూవీ రిలీజ్ కి రంగం సిద్ధం అవడంతో ఒకవైపు అభిమానులు, ప్రేక్షకులు.మరో వైపు ట్రేడ్ వర్గాలు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.ఇక ఆదిపురుష్’పై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది.
అలాగే ఇప్పుడు బుకింగ్స్ అదరగొడుతున్నాయి .బాహుబలితో పాన్ ఇండియా రికార్డులను షేక్ చేసిన ప్రభాస్ తర్వాత సాహో, రాధేశ్యామ్ సినిమాలతో ఫస్ట్ డే మంచి కలెక్షన్స్‌ను రాబట్టుకున్నాడు.సాహో అయితే హిందీలో వంద కోట్లకు పైగానే రాబట్టింది.ఇప్పుడు ఆదిపురుష్ వంతు వచ్చింది.అసలే శ్రీరామతత్వం ఉన్న ఈ సినిమాకు ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.
దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ బాక్సాఫీస్‌ను షేక్ చేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.సినీ బాక్సాఫీస్ విశ్లేషకుల అంచనాల మేరకు ఆదిపురుష్ సినిమా తొలి రోజున హిందీలో దాదాపు 40 కోట్ల మేరకు కలెక్షన్స్‌ను రాబట్టుకుంటుంది.ఇక తెలుగు సహా మిగిలిన తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఫస్ట్ డే 80 కోట్ల వసూళ్లు వస్తాయని అంటున్నారు.
ఇక వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 150 కోట్ల మేరకు నెట్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.అలా వస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ కావటం పక్కా అంటున్నాయి.
నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికే విడుదల చేయాలని భావించారు.అయితే ఆ సందర్భంలో వచ్చిన టీజర్ విమర్శలకు కేరాఫ్‌గా మారింది.
దీంతో మేకర్స్ ఆదిపురుష్ రిలీజ్ డేట్‌ను వాయిదా వేసి.వి.ఎఫ్.ఎక్స్ పై ఫోకస్ చేసి జూన్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఇక ఇటీవల వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది .అందుకు తగ్గట్టే తొలి రోజే రికార్డ్ వేట మొదలు పెడుతుంది .ఇక ఈ సినిమాని అన్ని భాషల్లో కలిపి దాదాపు 250 కోట్లకు డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.ప్రభాస్ కెరీర్‌లో అత్యధిక ధరకు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా ఆదిపురుష్ నిలిచింది.