కొన్ని దశాబ్దాలపాటు భారతీయ( Indian ) కార్ల పరిశ్రమను శాసించిన కార్ అంబాసిడర్( Ambassador ).ఇప్పటికీ ఈ క్లాసిక్ మాస్టర్‌పీస్ చాలా మంది ఔత్సాహికుల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.
భారతదేశంలో 1957లో తయారు చేసిన మొదటి కారు ఇదే.ఐతే రానురాను దేశంలో చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి.కొత్తకాలపు కార్లమీద మోజు పెరగడంతో పాతకాలపు ఫోర్-వీలర్‌పై ఆకర్షణ తగ్గిపోయింది.ఫలితంగా తయారీదారులు 2014లో దానిని నిలిపివేశారు.అయితే, కొంతమంది తమ పాత అంబాసిడర్ కార్‌ను కొత్తగా మార్చేందుకు డబ్బులు ఖర్చు చేస్తుండడం మనం చూడవచ్చు.
అవును, ఈ క్రమంలోనే కామ్‌కస్టమ్స్( ComCustoms ) అనే యూట్యూబ్ ఛానెల్ పాత అంబాసిడర్ కార్‌ను కొత్తగా మాడిఫై చేసిన వీడియోను పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అవుతోంది.ఈ వీడియోలు, ఫోటోలు చూస్తే పాత అంబాసిడర్ కార్ పూర్తిగా భిన్నమైన రూపంలో దర్శనమిస్తోంది.స్టైలిష్ అల్లాయ్ వీల్స్( Stylish alloy wheels ) నుంచి ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌ల వరకు మొత్తం మారిపోవడం ఇక్కడ గమనించవచ్చు.
అంతేకాకుండా ఇంటీరియర్‌ను కూడా పూర్తిగా మార్చేశారు.ఎంతలా అంటే, 90వ దశకం మోడల్ కారును ఇప్పటి కారే అనిపించేంతగా మార్చేశారు.
కామ్‌కస్టమ్స్ వివరాల ప్రకారం 1981 అంబాసిడర్ మార్క్4 కారుకు పెద్ద మేక్ఓవర్ చేసినట్టు తెలుస్తోంది.భారీ ఫీచర్స్ ఉన్న ఇప్పటి కార్లతో పోటీ పడేందుకు దాదాపు రూ.8 లక్షలు ఖర్చు చేసినట్టు భోగట్టా.పాత అంబాసిడర్ కార్ ఇంత కొత్తగా మారడానికి చాలా సమయమే తీసుకుంది.
తయారీదారులు దాని పెట్రోల్ మోడల్‌ను ఇసుజు డీజిల్‌కి కూడా అప్‌గ్రేడ్ చేశారు.మాడిఫై చేసిన అంబాసిడర్ కారులో 2023లో ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని అధునాతన ఫీచర్‌లను కూడా చేర్చారు.ఉదాహరణకు… కస్టమ్ పెయింట్ జాబ్, LED హెడ్‌లైట్, లెదర్ ఇంటీరియర్, ARC కాంపోజిట్ లీఫ్ స్ప్రింగ్ విత్ గ్యాస్ షాక్‌లు, పుష్ స్టార్ట్ బటన్, స్కార్పియో స్టీరింగ్ వీల్, స్కోడా ఎలక్ట్రిక్ సీట్లు, కస్టమ్ ఫ్యాబ్రికేటెడ్ డ్యాష్‌బోర్డ్ లాంటివి ఉన్నాయి.ఇంకా మరెన్నో అప్డేట్లు ఇక్కడ చూడవచ్చు.