తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ( Indian Film Industry ) మొత్తం ఎంతో గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి.ఇండియన్ సినిమాకి తన దర్శకత్వ ప్రతిభ తో మొట్టమొదటి ఆస్కార్ అవార్డు ని తెచ్చిన మహానుభావుడు ఆయన.
అలాంటి దర్శకుడితో సినిమా చెయ్యాలని ఎవరికి మాత్రం ఉండదు?, పెద్ద పెద్ద బడా సూపర్ స్టార్స్ సైతం రాజమౌళి( Rajamouli ) తో సినిమా కోసం పరితపిస్తూ ఉంటారు.

ఇదంతా ఇప్పుడు,మగధీర సినిమాకి ముందు రాజమౌళి ఒక మామూలు డైరెక్టర్ మాత్రమే.వరుసగా హిట్స్ అయితే ఉన్నాయి కానీ, ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసే సినిమాలు మాత్రం లేవు.అలాంటి సమయం లో వచ్చిన ‘మగధీర’ సినిమా రాజమౌళి రేంజ్ ని మార్చేసింది.
ఆయనపై అంచనాలు అందరిలో ఎప్పటికీ అందుకోలేని రేంజ్ కి వెళ్ళిపోయింది.ఆ సమయం లో ఆయన తన రేంజ్ ని తగ్గించుకుంటూ కమెడియన్ సునీల్ తో ‘మర్యాద రామన్న’( Maryada Ramanna ) అనే సినిమాని తెరకెక్కించాడు.

ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అప్పట్లోనే ఈ సినిమా సుమారుగా 34 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించాయి.అయితే ఈ సినిమాకి ప్రారంభానికి ముందు రాజమౌళి సునీల్ గురించి ఆలోచించే ముందే పలువురి హీరోలను సంప్రదించాడట.వారిలో ఒకరు అల్లరి నరేష్( Allari Naresh ).ఈ సినిమా స్టోరీ చెప్పగానే చెయ్యడానికి అల్లరి నరేష్ ఒప్పుకున్నాడు కానీ , ఏడాదికి అరడజనుకి పైగా సినిమాలు చేస్తూ వచ్చే అల్లరి నరేష్ ని, సినిమా పూర్తి అయ్యేంత వరకు మరో ప్రాజెక్ట్ కి కదలకూడదు అని రాజమౌళి షరత్తు పెట్టాడంట.అందుకు అల్లరి నరేష్ ఒప్పుకోలేదు, దాంతో ఈ ప్రాజెక్ట్ అల్లరి నరేష్ చెయ్యి నుండి, సునీల్ చేతికి వెళ్ళింది.
ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి ఈ చిత్రం అల్లరి నరేష్ కి కూడా సరిపోతుంది అని అనిపించింది.ఎందుకంటే ఆయన తన కెరీర్ లో ఇలాంటి పాత్రలే ఎక్కువగా పోషిస్తూ వచ్చాడు కాబట్టి.
అలా అల్లరి నరేష్ ఇంత పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ ని మిస్ అయ్యాడు.







