సినిమా ఇండస్ట్రీ యేడు మారిపోతూ ఉంటుంది.కొత్త టెక్నాలజీ వస్తుంది.
కొత్త కొత్త నటులు వస్తూ ఉంటారు.దర్శకులు, నిర్మాతలు చాలా మంది కొత్తవాళ్లు పరిచయం అవుతూ ఉంటారు.
అందుకే సినిమా తీసే విధానంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమాలు( Telugu Movies ) విడుదల చేసే స్థాయికి ఎదిగారు.అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా గతంతో పోలిస్తే ఇప్పుడు అనేక తప్పులు జరుగుతున్నాయి.
ఒక దశాబ్దం వెనక్కి వెళితే సినిమా ఇండస్ట్రీ ఎంతో పద్ధతిగా ఉండేది హీరోలు దర్శకుడికి నిర్మాతకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు పొద్దున్నే వారు కనిపిస్తే కచ్చితంగా నమస్కారం పెట్టేవారు.

ఎలాంటి పరిస్థితులలో కూడా నిర్మాతకు( Producer ) నష్టం వచ్చే పని చేసేవారు కాదు.ఎంత జ్వరం ఉన్నా ఎలాంటి గాయాలు తగిలిన ఆ షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసేవారు.ఇటీవల ఒక తెలుగు సీనియర్ హీరో( Telugu Senior Hero ) ఇంటర్వ్యూ ఇస్తూ గతంలో తన సినిమాలో హీరోగా నటిస్తున్న సమయంలో బాగా జ్వరం ఉన్న టైంలోనే చలి ప్రదేశాల్లో షూటింగ్ కి వెళ్లాల్సి వచ్చేదని, కాళ్లకు దెబ్బలు తగిలిన సమయంలోనే ఫైట్ సీన్స్ కి కూడా నో చెప్పలేదని తెలిపాడు.
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు హీరోకి చిన్న గీత గీసుకుంటే చాలు పది రోజుల పాటు షూటింగ్ వాయిదా వేస్తారు.కొంచెం జుట్టు ఊడితే ఏం చేస్తారో ఎక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటారో కూడా తెలియదు.

అప్పట్లో పది లక్షలు రెమ్యునరేషన్ ఇస్తే 10 కోట్లుగా భావించేవారు.ఇప్పుడు 50 కోట్లు ఇచ్చిన తర్వాత కూడా సినిమా పూర్తవుతుందో లేదో తెలియని పరిస్థితి.హీరోలు తమ నిబద్దత ను కోల్పోతున్నారు, సిన్సియారిటీని పక్కన పెడుతున్నారు.వారి కెరియర్ ను మాత్రమే అలాగే అభిమానులు మాత్రమే ఊహించుకొని ఈ సినిమాలను తీయడం మొదలుపెట్టారు.
అందుకే ఇప్పుడు నిర్మాత నష్టపోతున్నాడు కాదు కాదు చచ్చిపోతున్నాడు.సినిమా మూగబోతోంది… దాని స్థాయి పడిపోతుంది ఎన్ని వేల కోట్ల వసూలు వస్తున్నాయి అనేది కాదు ఎంత విలువలు పాటిస్తున్నామనేది పట్టించుకోవడం మానేశారు జనాలు.







