Sandeep Reddy Vanga: పురిటి నొప్పుల కన్నా ఎక్కువ బాధ అనుభవించిన అర్జున్ రెడ్డి దర్శకుడు

అర్జున్ రెడ్డి.( Arjun Reddy Movie ) 2017లో సంచలనం సృష్టించింది ఈ చిత్రం.

 Sandeep Reddy Vanga Problems With Arjun Reddy Movie-TeluguStop.com

సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరోగా వచ్చిన ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.తన నిజ జీవితంలో ఉన్న లవ్ స్టోరీని ఆధారంగా చేసుకుని సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని చేసాడు.

నిజానికి సందీప్ షుగర్ ఫ్యాక్టరీ అనే పేరుతో కథ రాసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అర్జున్ రెడ్డి చిత్రాన్ని చేయాల్సి వచ్చింది.ఈ సినిమా కథని ఎంతోమంది నిర్మాతలకు ఎవరూ కూడా తీయడానికి సాహసం చేయలేదు.

అందుకే సందీప్ తన సొంత ఆస్తులు తాకట్టు పెట్టి దాదాపు 3 కోట్లు ఖర్చుతో ఈ చిత్రాన్ని తీశాడు.

Telugu Animal, Arjun Reddy, Sandeepreddy, Kabir Singh, Suresh Babu-Movie

ఈ సినిమా తీసింది మొదలు సందీప్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆస్తుల విషయంలో ఇంట్లో గొడవలు పడుతూనే ఒకానొక సమయంలో అవి పెద్ద తగాదాలకు కూడా కారణమయ్యాయి.అయినా కూడా ఎంతో ఓపికతో ఈ చిత్రాన్ని తీసి విడుదల చేయాలని భావించాడు.ఇక సినిమా తీసి తరవాత సురేష్ బాబు( Suresh Babu ) తనకైనా మూడు కోట్లు ఖర్చు ఇచ్చి సినిమాను కొనుక్కోవాలనుకున్నప్పటికీ కొంత సమయం తీసుకుని ఆలోచించి ఆ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు.

Telugu Animal, Arjun Reddy, Sandeepreddy, Kabir Singh, Suresh Babu-Movie

కానీ విడుదల చేయడం అంటే పురిటి నొప్పుల కన్నా కష్టం అనే విషయం సందీప్ కి తెలిసి వచ్చింది.ఎట్టకేలకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేశాడు.అర్జున్ రెడ్డి ట్రైలర్ సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే.చూసిన తర్వాత దాదాపు 30 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి ఈ చిత్రాన్ని కొనుక్కున్నారు.

Telugu Animal, Arjun Reddy, Sandeepreddy, Kabir Singh, Suresh Babu-Movie

ఈ సినిమాను కబీర్ సింగ్ రూపంలో హిందీలో కూడా తీయగా కేవలం ద్వారానే 60 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించాడు అంతేకాదు దీని రీమేక్ హక్కుల ద్వారానే భారీ మొత్తాన్ని కూడా పెట్టుకున్నాడు అర్జున్ రెడ్డి.ఇక కబీర్ సింగ్ తర్వాత ఆనిమల్ ( Animal Movie ) అనే ఒక హిందీ సినిమా తప్ప మరో చిత్రము కూడా తీయలేదు అతడు తీసే ప్రతి సినిమాలోను ఒక రకమైన మరియు భిన్నమైన కంటెంట్ ఉండేలా చూసుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube