ఐకాన్ స్టార్ తో శ్రీలీల డాన్స్.. అబ్బ పోస్టర్ చూస్తేనే 'ఆహా' అనాల్సిందే!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ( sreeleela )గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.ఈ ఒక్క సినిమాతో ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయిందనే చెప్పాలి.

 Sreeleela To Shake Leg With Tollywood Sensational Dancer Allu Arjun, Allu Arjun,-TeluguStop.com

ఈమె అందం, అభినయం అన్ని కూడా ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తాయి.శ్రీలీల పెళ్లి సందడి సినిమా ద్వారా వెండి తెరమీద అడుగు పెట్టింది.

ఈ సినిమా తర్వాత శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో దూసుకు పోతుంది.

ఈమె ఆఫర్స్ వచ్చే కొద్దీ రేటు కూడా భారీగా పెంచుకుంటూ పోతుంది.

ఇటీవలే రవితేజ ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంది.ప్రస్తుతం ఈ భామ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ ( Mahesh babu )కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది.

అలాగే బాలయ్య – అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న భగవంత్ కేసరిలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే ఈ భామ చేతిలో పవన్ స్టార్ మూవీ కూడా ఉంది.పవన్ కళ్యాణ్ – హరీష్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ, రామ్ పోతినేని – బోయపాటి మూవీ, నితిన్ మూవీలో కూడా నటిస్తుంది.

అలాగే ఇంకా లైన్లో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఈ భామ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో స్టెప్పులు వేయనుంది.తెలుగు ఓటిటీ ప్లాట్ ఫామ్ అయిన ఆహా వీడియోలో ఇంట్రెస్టింగ్ గా త్వరలోనే ఒక అదిరిపోయే అప్డేట్ రిలీజ్ కానుంది.ఈ క్రమంలోనే ఈ రోజు ఈ అమ్మడి పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్, శ్రీలీలకు( Allu arjun ) సంబంధించిన డాన్స్ పోస్టర్ రిలీజ్ చేయగా భారీ హైప్ నెలకొంది.

ఇద్దరు సూపర్ డాన్సర్స్ కావడంతో ఇద్దరు కలిసి చేస్తే ఎలా ఉంటుందా అని అందరిలో ఆసక్తి నెలకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube