హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి కొత్త భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకోనున్న ఈ ఆస్పత్రి విస్తరణ నేపథ్యంలో కొత్త బ్లాక్ నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు.
రూ.1571 కోట్ల వ్యయంతో నిమ్స్ ఆస్పత్రి భవనాన్ని నిర్మించనుంది ప్రభుత్వం.సుమారు 32 ఎకరాల్లో రెండు వేల పడకలతో నిర్మించనున్న కొత్త బ్లాక్ లో మొత్తం 38 విభాగాల సేవలు అందుబాటులో ఉండనున్నాయి.ఓపీ, ఐపీలతో పాటు ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాక్ లు ఏర్పాటు కానున్నాయి.
స్పెషాలిటీ సేవలను దృష్టిలో పెట్టుకుని ఏకంగా ఎనిమిది అంతస్థుల్లో ఓపీ బ్లాక్ ను నిర్మించనున్నారు.ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేకంగా ఎనిమిది అంతస్థులతో బ్లాక్, ఐపీ రోగుల కోసం 13 అంతస్థులతో మరో బ్లాక్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.







