టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ గోపాల్ వర్మ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా హైలైట్ అయ్యారని చెప్పవచ్చు.
తరచూ ఎవరో ఒకరిపై కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా కామెంట్స్ చేయడం లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకోవడం ఆర్జీవికి అలవాటే.రాజకీయల పరంగా సినిమాల పరంగా అలాగే సమాజంలో జరిగే విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు.
ఒకప్పుడు రాంగోపాల్ వర్మ సినిమాలో అంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఇష్టంగా చూసేవారు.

కానీ రాను రాను ఆయన సినిమాలలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులు ఆయన సినిమాలను చూడడమే మానేశారు.ముఖ్యంగా తెలుగులో ఫిమేల్ యాంకర్లతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తూ ఇంటర్వ్యూలలో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ దారుణమైన విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు.ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసిన ఆర్జీవి తన మాట తీరుని, ఆలోచన విధానాలను మాత్రం మార్చుకోరు.
ఇది ఇలా ఉంటే గతంలో ఆర్జీవి దగ్గర గార్లపాటి వెంకటేష్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్( Venkatesh ) ఆర్జీవి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అప్పుల్లో కూరుకుపోయిన ఆర్జీవీ.అవి తీర్చేందుకే ఇలాంటి సినిమాలు తీస్తున్నాడని వెల్లడించాడు.
అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియోలో వెంకటేష్ మాట్లాడుతూ.

వర్మ తిక్క తిక్క పనులు చేసి దాదాపు రూ.20 కోట్ల వరకు అప్పుల పాలయ్యాడు.అదే సమయంలో కొంతమంది వైసీపీ నాయకులు డబ్బులు ఆఫర్ చేయడంతో ఇలాంటి సినిమాలు తీశారు.వాటికి బాగా అలవాటుపడి, ఎటువంటి నిజం లేకపోయినా ఒక దుష్ప్రచారం చేయడం అలవాటు చేసుకున్నాడు.
చివరి ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా( Lakshmi’s NTR ) తీసి చంద్రబాబు నాయుడు, లోకేష్ మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు.ఆ సినిమా తీసినపుడు వైసీపీలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి వర్మ గారితో డీల్స్ మాట్లాడుకోవడం నేను నా కళ్లారా చూశాను.
తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల నాకు కో డైరెక్టర్‌తో ఆర్గ్యుమెంట్ జరిగింది.దీంతో నన్ను వద్దని పక్కకు నెట్టారు.అయితే, ఇప్పుడు అలాంటి ప్రయత్నమే మరోసారి చేయబోతున్నారు.వర్మ మరోసారి చేయబోతున్న విష ప్రయోగంలో జగన్ గారు, భారతి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, కొడాలి నాని.
ఇలా అందరి క్యారెక్టర్స్ పెట్టి దుష్ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు.ఆయనకు కావలిసింది పేమెంట్.
అది ఇస్తే చాలు.అయితే, బయటి నుంచి చూసేవాళ్లు వర్మను పెద్ద క్రియేటివ్ డైరెక్టర్ అనుకుంటారు.
ఒకప్పటి వర్మలా ఇప్పుడు లేరు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు గార్లపాటి వెంకటేష్.







