పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానులకు దిశా నిర్దేశం చేసిన కోరం కనకయ్య, మల్లిబాబు యాదవ్

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరబోయే పార్టీ ప్రకటిస్తున్న సందర్బంగా, శ్రీనన్న ఏ నిర్ణయం తీసుకున్నా, మనమంతా వర్గాలకతీతంగా, ఏకతాటిపై నిలబడాలని కార్యకర్తలకు, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ నిర్ణయాల నేపథ్యంలో పొంగులేటి ముఖ్య అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో కామేపల్లి మండలం కొత్త లింగాల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో పొంగులేటి ముఖ్య అనుచరులు అభిమానుల సమావేశం జరిగింది.

 Koram Kanakaiah And Mallibabu Yadav Directed Fans Of Ponguleti Srinivasa Reddy,-TeluguStop.com

ఈ సమావేశంలో కోరం కనకయ్య మేకల మల్లిబాబు యాదవ్ లు మాట్లాడిన తీరు చూస్తే మళ్లీ పాత గూటికి కాంగ్రెస్ పార్టీకే చేరుతున్నారని తెలుస్తోంది.టిఆర్ఎస్ టిడిపి సీపీఐ పార్టీల నుంచి భారీగా పార్టీలో చేరికలు జరుగుతున్నాయని,, అందరూ కలిసికట్టుగా పాత కొత్త అని తేడా లేకుండా వర్గాల కతీతంగా పనిచేయాలని, బి ఆర్ఎస్ పార్టీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నమ్మకద్రోహం చేసిందని,

ఆ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో అజ్మీర పాప్యా నాయక్, skపతే మహమ్మద్, గురవయ్య అజ్మీర మంగీలాల్, ముత్తబోయిన రామ్మూర్తి పరంశెట్టి సాంబయ్య, కే వెంకన్న తడికమళ్ళ ప్రసాదు, ముత్తబోయిన సతీష్ ఎస్ వీరబాబు, k.బిక్షమయ్య, s.నరేష్, భూక్యా రాంజి , ఎస్ నరేష్,g.కిషన్, అంగోజు నరసింహ చారి, లకావత్ బిచ్చు భూక్యా రాజేష్,, జరపల భాస్కర్ బట్టు పెంట్యా,వడ్లకొండ సోమయ్య, బేతి గోపి చలమర్త మధు,శ్రీను, ఎదుళ్ళ నరసింహారావు,, దాసరి గురేషు బి నరసింహ నాయక్ పి ప్రసాద్, బానోత్ వీరన్న తేజావత్ రాందాస్, మల్లికార్జునరావు, తురక రవి బండి నాగరాజు మేకపోతుల మహేష్, తిరుమలకొండ బాబు తొండల ముత్తయ్య శీలం పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube