దేశంలో విపత్తు నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు మొత్తం రూ.8 వేల కోట్లను కేటాయించనుంది.
రాష్ట్రాల్లో అగ్నిమాపక సేవల విస్తరణ మరియు నవీకరణకు రూ.5 వేల కోట్లను కేటాయించనుంది.ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ తో పాటు పుణె మెట్రో ప్రాజెక్టులకు రూ.2,500 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.అదేవిధంగా 17 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడకుండా ల్యాండ్ స్లైడ్ రిస్క్ మిటిగేషన్ స్కీం చర్యలకు రూ.825 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది.







