భారత్‌లో పెట్టుబడులకు ఎన్ఆర్ఐల ఆసక్తి .. ఈ నగరాలపైనే చూపు, సర్వేలో ఆసక్తికర విషయాలు

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ఉద్యోగ, వ్యాపార అవకాశాలు దెబ్బతిన్నాయి.విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే భారతీయులు కరోనా కారణంగా సొంత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది.

 Nris Look Beyond Major Cities To Real Estate Investment In Small Indian Towns De-TeluguStop.com

దీంతో అనుకోని విపత్తులు ఎదురైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న చాలామందిని ఆలోచింపజేసింది.మరోవైపు రూపాయి విలువ తగ్గడంతో రియల్ ఎస్టేట్‌ను( Real Estate ) పెట్టుబడి మార్గంగా ఎంపిక చేసుకోవాలని ఎన్ఆర్ఐలు( NRI ) భావిస్తున్నారు.

డెవలపర్లు కూడా ఈ డిమాండ్ ను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఫలితంగా భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి చెందుతోంది.

కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా స్థిరాస్థి రంగం మందగించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు మళ్లీ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.

వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు మనదేశంలో స్టాక్స్, బంగారం, మ్యూచవల్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నారు.

కానీ ఎక్కువ మంది చూపు మాత్రం రియల్ ఎస్టేట్ పైనే వుంది.ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులు.మనదేశంలోని కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లోనూ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఎస్‌బీఎన్ఆర్ఐ నివేదిక చెబుతోంది.భారతీయ రియల్ ఎస్టేట్ విభాగం 2023-2028 మధ్యకాలంలో 9.2 శాతం సీఏజీఆర్ వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా.52 శాతం మంది ఎన్ఆర్ఐలు భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లలో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు కమర్షియల్ రియల్ ఎస్టేట్ (సీఆర్ఈ)లో( Commercial Real Estate ) పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారని సర్వే పేర్కొంది.రెసిడెన్షియల్ సెగ్మెంట్‌లతో పోలిస్తే సీఆర్ఈలను ఎన్ఆర్ఐలు ప్రాధాన్యతగా ఎంచుకున్నారు.

Telugu Chandigarh, Coimbatore, Colliersindia, Estate, Nri, Nris, Sbnri, Tier-Tel

కొలియర్స్ ఇండియా సీఎండీ సంకీ ప్రసాద్( Sankey Prasad ) మాట్లాడుతూ.కోవిడ్ ప్రభావం నుంచి ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్నారు.అయితే పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఆర్ఐలను పురికొల్పేందుకు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు.2023 క్యూ 1లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్.అమ్మకాలలో బలమైన వృద్ధిని సాధించింది.

భారతదేశంలో ఆర్ధిక వృద్ధి, ఆదాయాలు పెరగడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల ఈ సానుకూల పరిస్ధితులు చోటుచేసుకున్నాయని ప్రసాద్ వెల్లడించారు.

Telugu Chandigarh, Coimbatore, Colliersindia, Estate, Nri, Nris, Sbnri, Tier-Tel

రాబోయే రోజుల్లో అభివృద్ధి అంచనాతో పాటు బంధాలను కాపాడుకోవడానికి ఎన్ఆర్ఐలు ద్వితీయ శ్రేణి నగరాలనే( Tier-II Cities ) పెట్టుబడులకు ఎంచుకుంటున్నారని సర్వేలో తేలింది.దేశంలో చండీగఢ్, కోయంబత్తూర్‌లు ఎన్ఆర్ఐ పెట్టబడుల విషయంలో ముందంజలో వున్నాయి.ప్రణాళికాబద్ధమైన పట్టణ అభివృద్ధికి, ఆధునిక మౌలిక సదుపాయాలకు , కాస్మోపాలిటన్ జీవనశైలి, విద్య, వైద్య సదుపాయాల నేపథ్యంలో చండీగఢ్ నగరం ఎన్ఆర్ఐలను ఆకర్షిస్తుంది.

ఇక కోయంబత్తూరు విషయానికి వస్తే.ఉన్నతమైన జీవన ప్రమాణాలు, తయారీ రంగం, ఐటీ హబ్‌‌గా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రవాస భారతీయుల దృష్టిలో పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube