నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే విషయం మీద చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి కానీ అది ఎప్పటికీ ఒకే అవుతుందా అనేది ఎవ్వరికీ తెలియడం లేదు మళ్ళీ రీసెంట్ గా మోక్షజ్ఞ( Mokshagna ) పేరు మళ్ళీ తెర మీదకి వచ్చింది ఈ ఇయర్ లో ఆయన చేయబోయే సినిమా స్టార్ట్ అవ్వబోతున్నట్లు గా తెలుస్తుంది…ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ మధ్య మోక్షజ్ఞ బాగా బరువు పెరిగిపోవడంతో నందమూరి ఫ్యాన్స్ షాకైపోయారు.ఆయన లుక్ చూసి మోక్షజ్ఞ సినిమాల్లోకి వచ్చినట్లే అని కూడా అనుకున్నారు.
ఆ తర్వాత మోక్షజ్ఞ మళ్లీ బరువు తగ్గడంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.ఇక తాజాగా ఎవరూ ఊహించని బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో దర్శనమిచ్చారు.

చాలా స్లిమ్ గా, హ్యాడ్సమ్ గా మారిపోయాడు.రెండు రోజుల క్రితం బయటకు వచ్చిన మోక్షజ్ఞ తాజా ఫోటోలు చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.ఒకప్పుడు నందమూరి మోక్షజ్ఞ హీరో మెటీరియల్ లానే లేడు అనుకున్న వారంతా.హీరో అంటే ఇలా ఉండాలి అనుకునేలా చేశాడు.సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికే మోక్షజ్ఞ ఇలా మారాడని.త్వరలోనే ఆ స్టార్ డైరెక్టర్ తో ఆయన డబ్యూ మూవీ స్టార్ట్ అవుతుందని బలంగా ప్రచారం జరుగుతోంది…

ఇక ఇదే సమయంలో ప్రముఖ జ్యోతిష్యులువేణు స్వామి( Venu Swamy ) మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తే ఏం జరుగుతుంది, అతడి భవిష్యత్తు ఏంటి అనే విషయాలపై మాట్లాడారు.మోక్షజ్ఞ సినీ ఎంట్రీ చాలా లేటుగా ఉంటుందని.అయితే తెలుగు ఇండస్ట్రీలో అతడు అనతి కాలంలోనే తిరుగులేని స్టార్ హీరోగా ఎదుగుతాడని వేణుస్వామి వెల్లడించాడు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో మోక్షజ్ఞకు మంచి భవిష్యత్తు ఉందని.అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడని వేణుస్వామి పేర్కొన్నాడు.
అయితే తండ్రి బాటలో మోక్షజ్ఞ రాజకీయాల్లోకి వెళ్లకపోవడమే మంచిదని.అతడికి పొలిటికల్ ఫ్యూచర్ లేదని తేల్చేశారు.
దీంతో వేణుస్వామి కామెంట్స్ కాస్త నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి…చూడాలి మరి బాలకృష్ణ లాగా మోక్షజ్ఞ కూడా స్టార్ హీరో అవుతాడో లేదో…








