ఇక ఏపీ అధికార పార్టీ వైసిపి ( YCP )తమకు పూర్తిగా రాజకీయ శత్రువు అని బిజెపి తేల్చి చెప్పేసింది.కొద్దిరోజుల క్రితం జరిగిన విశాఖ బిజెపి సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వైసిపి ప్రభుత్వం పై తీవ్ర పదజాలం తో విమర్శలు చేశారు.
కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను జగ( YS Jagan Mohan Reddy )న్ తమవిగా ప్రచారం చేసుకుంటున్నారని, ఏపీలో అభివృద్ధి ఏమాత్రం చోటు చేసుకోలేదని విమర్శలు చేశారు.అమిత్ సభతో బిజెపి వైసిపి విషయంలో ఏ స్టాండ్ తో ఉందనే విషయం అందరికీ అర్థమయిపోయింది.
బిజెపి చేసిన ఈ విమర్శలకు వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్ పెద్దగా స్పందించలేదు.కానీ మాజీమంత్రి పేర్ని నాని( Perni nani ) వంటి వారు బిజెపిపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
అయినా జగన్ మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు.బిజెపి మద్దతు మనకు ఉండకపోవచ్చు , అయినా ప్రజల ఆశీస్సులు ఉంటే చాలు అన్నట్టుగా జగన్ మాట్లాడారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బిజెపి మద్దతు ఉంటుందనే విషయం అందరికీ క్లారిటీ వచ్చేసింది.

ఈ క్లారిటీ తర్వాత బిజెపి మద్దతు లేకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైసిపి ఏ విధంగా ముందుకు వెళ్లబోతుంది ? జగన్ ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.2018 లో చంద్రబాబుపై విభజన హామీల పేరుతో రాజకీయంగా జగన్ ఒత్తిడి పెంచారు.కేంద్రం నుంచి ఎన్డీయే నుంచి టిడిపి బయటకు వచ్చే విధంగా జగన్ విమర్శలతో విరుచు పడ్డారు.
బిజెపితో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సన్నిహిత సంబంధాలు లేవనే విషయాన్ని నిరూపించుకునేందుకు చంద్రబాబు చాలానే తంటాలు పడ్డారు.కేంద్రంపై ధర్మ పోరాట దీక్షలు వంటివి చేపట్టారు.ఇక ఆ తర్వాత నుంచి టిడిపి, బిజెపి ల మధ్య రాజకీయ శత్రుత్వం తీవ్రంగా ఉండేది.అయితే ఇటీవల కాలంలో టిడిపి అధినేత చంద్రబాబు బిజెపి అగ్ర నేతలను కలిసిన తర్వాత, అలాగే కర్ణాటక ఎన్నికల ఫలితాలు తరువాత బీజేపీ ఆలోచనలో పడింది.
వైసీపీ తో దూరందా ఉంటేనే మంచిది అని నిర్ణయించింది.దీంతో జగన్ బిజెపిని ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది తేలాల్సి ఉంది.

టిడిపి జనసేన పార్టీలపై చేస్తున్న స్థాయిలో బిజేపి పై విమర్శలు చేస్తే జరిగే నష్టం తీవ్రంగా ఉంటుందని జగన్ కు తెలియంది కాదు.అందుకే బిజెపిపై విమర్శల దాడిని నామమాత్రంగానే చేపట్టి, ఆ పార్టీతో మిత్రుత్వం లేకపోయినా, శత్రుత్వం ఏర్పడకుండా జగన్ జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.ఏపీలో బిజెపికి బలం అంతంత మాత్రమే అనట్టుగా ఉన్నా, వచ్చే ఎన్నికల్లోను కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని, సర్వే రిపోర్ట్ లు పరిగణలోకి తీసుకునే బిజెపితో శత్రుత్వాన్ని పెంచుకునేందుకు వైసీపీ సిద్దపడకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.







